పులిచింతల ప్రాజెక్టు 16వ క్రస్ట్ గేటు డ్యామేజీ..!

పులిచింతల ప్రాజెక్టు 16వ క్రస్ట్ గేటు డ్యామేజీ..!
పులిచింతల ప్రాజెక్టులో 16వ క్రస్ట్ గేటు కొట్టుకుపోయింది. ప్రమాదవశాత్తు గేటు ఊడిపోయిన గేటు నీటిలో కొట్టుకుపోయింది.

పులిచింతల ప్రాజెక్టులో 16వ క్రస్ట్ గేటు కొట్టుకుపోయింది. ప్రమాదవశాత్తు గేటు ఊడిపోయిన గేటు నీటిలో కొట్టుకుపోయింది. నీటిని విడుదల చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గేటు విరిగిపోవడంతో ప్రకాశం బ్యారేజీకి భారీగా నీరు వెళ్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. 14 గేట్లు ఎత్తి 6 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరదనీటి పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను కృష్ణ, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం చేశారు.

జలాశయం గేటు విరిగిపోవడంతో యుద్ధప్రాతిపదికన అధికారులు చర్యలు చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగారు. అయితే ఎక్కువగా నీరు ప్రవహిస్తుండటంతో కొత్త గేటు అమర్చడం సాధ్యం కాలేదు. దీంతో నీటి మట్టాన్ని తగ్గించారు అధికారులు. 18 మీటర్ల నీటి మట్టాన్ని ఐదు మీటర్లకు తగ్గించి.. స్టాప్‌లాక్ సాంకేతికతో తాత్కాలికంగా నీటిని అడ్డకట్ట వేశారు. అంతకుముందు.. అధికారులతో కలిసి మంత్రి అనిల్‌కుమార్ పులిచింతల ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిశీలించారు. ప్రత్నామ్నాయ ఏర్పాట్లపై మంత్రికి అధికారులు వివరించారు.

ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టులో గరిష్టస్థాయిలో నీరు నిల్వ ఉంది. పులిచింతల ఇన్‌ఫ్లో లక్షా పదివేల క్యూసెక్కుల నీరు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 44.53 టీఎంసీలకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుతం 174.14 అడుగులు ఉంది.

Tags

Read MoreRead Less
Next Story