ఏపీలో కొత్తగా 1,941 కరోనా కేసులు.. ఏడుగురు మృతి!

ఏపీలో కొత్తగా 1,941 కరోనా కేసులు.. ఏడుగురు మృతి!
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఓవైపు కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా.. మరోవైపు కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఓవైపు కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా.. మరోవైపు కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. 24 గంటల వ్యవధిలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు స్థాయిలో పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 31 వేల 657 శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఒక వెయ్యి 941 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 424 కరోనా కేసులు నమోదు కాగా.. అత్యుల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 25 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9 లక్షల 10 వేల 943కి చేరింది.

మరోవైపు.. గడిచిన 24 గంటల్లో కోవిడ్ చికిత్స పొందుతూ ఏడుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో ఇద్దరు, విశాఖ జిల్లాలో ఇద్దరు మరణించగా.. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 7 వేల 251కి చేరింది. ఒక్కరోజులో 835 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్చ్ కాగా.. ప్రస్తుతం 11 వేల 809 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి 52 లక్షల 70 వేల 771 మంది శాంపిల్స్‌ తీసుకుని పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. అనంతపురం జిల్లాలో కొత్తగా 71 కరోనా కేసులు వెలుగుచూశాయి. చిత్తూరులో 323, తూర్పుగోదావరిలో 27, గుంటూరు 424 కరోనా కేసులు నమోదు కాగా.. కడప జిల్లాలో 74, కృష్ణా జిల్లాలో 212, కర్నూలులో 86, నెల్లూరులో 231, ప్రకాశం జిల్లాలో 59, శ్రీకాకుళం 102, విశాఖ 258, విజయనగరం 49, పశ్చిమగోదావరి జిల్లాలో 25 కొత్త కోవిడ్ కేసులు వెలుగుచూశాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టంచేశారు. కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న వేళ.. పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రభుత్వం జిల్లాల అధికారులను ఆదేశించింది. ప్రజలు కరోనా నిబంధనలు, మాస్క్‌లు, భౌతికదూరం, శానిటైజర్లు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story