ఏపీలో కొత్తగా 3,309 కరోనా కేసులు.. 12 మంది మృతి..!

ఏపీలో కొత్తగా 3,309 కరోనా కేసులు.. 12 మంది మృతి..!
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొత్తగా 3వేల 309 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొత్తగా 3వేల 309 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 740 కరోనా కేసులు వెలుగుచూడగా.. అత్యుల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 26 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 31వేల 929 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా.. వీరిలో పదిశాతం మంది కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్కరోజులో కరోనా నుంచి ఒక వెయ్యి 53 పూర్తిగా కోలుకోగా ప్రస్తుతం 18 వేల 666 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 12 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. అనంతపురం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 7 వేల 291కి చేరింది. ఇక రాష్ట్రంలో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులను ఒకసారి పరిశీలిస్తే.. అనంతపురం జిల్లాలో 133, చిత్తూరు 740, తూర్పుగోదావరి 111, గుంటూరు 527, కడప 124, కృష్ణా 278, కర్నూలు 296, నెల్లూరు 133, ప్రకాశం 174, శ్రీకాకుళం 279, విశాఖ 391, విజయనగరం 97, పశ్చిమగోదావరి జిల్లాలో 26 కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story