APSRTC : శివరాత్రికి 3,777 స్పెషల్ బస్సులు.. అది లేకుంటే బస్సుల్లోకి నో ఎంట్రీ..!

APSRTC : శివరాత్రికి 3,777 స్పెషల్ బస్సులు.. అది లేకుంటే బస్సుల్లోకి నో ఎంట్రీ..!
భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఈ స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నారు.

మహాశివరాత్రి సందర్భంగా ఏపీలోని 98 శైవక్షేత్రాలకి స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లుగా APSRTC ఓ ప్రకటనలో వెల్లడించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఈ స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నారు. అత్యధికంగా కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం, మహానంది, అహోబిలంకు 938 బస్సుల్ని నడుపుతారు. ఇక గుంటూరు జిల్లా నరసరావుపేట వద్దనున్న కోటప్పకొండకు 856 బస్సుల్ని నడుపుతున్నట్టుగా ఆర్టీసీ ఎండీ ఠాకూర్ వెల్లడించారు. అయితే బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకి మాస్క్ తప్పనిసరి అని లేనిచో బస్సుల్లోకి అనుమతించమని అధికారులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story