ఏపీలో కొత్తగా 4,157 కేసులు, 18 మంది మృతి

ఏపీలో కొత్తగా 4,157 కేసులు, 18 మంది మృతి
రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరింత విజృంభిస్తుండటంతో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక రోజు వ్యవధిలో వెయ్యి కేసులు నమోదవుతుంటం ఆందోళన కలిగిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. సెకండ్ వేవ్‌లో కోవిడ్ వైరస్ మరింత కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరింత విజృంభిస్తుండటంతో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక రోజు వ్యవధిలో వెయ్యి కేసులు నమోదవుతుంటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4 వేల 157 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బారిన పడి 18 మంది మృతి చెందారు. 35 వేల 732 శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఒక వెయ్యి 606 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 28,383 నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 9 లక్షల 37 వేల 49 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. కరోనా నుంచి 9 లక్షల ఒక వెయ్యి 327 మంది కోలుకున్నారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 7 వేల 339కి చేరింది.

ఏపీలో గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు, మరణాల సంఖ్యను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 617 కొత్త కేసులు నమోదు కాగా.. అత్యుల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 60 కేసులు వెలుగుచూసాయి. అనంతపురం జిల్లాలో 297, చిత్తూరు 517, గుంటూరు 434, కడప 112, కృష్ణా జిల్లాలో 135, కర్నూలు 386, నెల్లూరు 276, ప్రకాశం జిల్లాలో 230, శ్రీకాకుళం 522, విశాఖ 417 విజయనగరం జిల్లాలో 154 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్నాయి. నెల్లూరులో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, విశాఖలో ఇద్దరు, అనంతపురం, తూర్పగోదావరి, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story