Macherla: ఫస్ట్ నైట్ అంటే భయం.. అందుకే నవ వరుడి ఆత్మహత్య..

Macherla: ఫస్ట్ నైట్ అంటే భయం.. అందుకే నవ వరుడి ఆత్మహత్య..
Macherla: మాచర్లలోని సాగర్‌ రింగ్‌రోడ్‌‌లో ఊహించిన ఘటన చోటుచేసుకుంది.

Macherla: మాచర్లలోని సాగర్‌ రింగ్‌రోడ్‌‌లో ఊహించిన ఘటన చోటుచేసుకుంది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్యనారాయణరాజు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు పత్తిగుడుపు కిరణ్‌కుమార్‌ (32)కు ఈ ఏప్రిల్ 11న తెనాలికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. ఏప్రిల్ 12న భార్యను తీసుకొని మాచర్ల వెళ్లాడు. తిరిగి తెనాలి వస్తుండగా ఇప్పుడే వస్తానని చెప్పి కిరణ్‌కుమార్ ఇటీవల శవమై కనిపించాడు.

ఏప్రిల్ 16న కిరణ్ కుమార్‌కు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. అందుకే తెనాలికి బయలుదేరాడు. కానీ గుంటూరులోనే బస్ స్టాండ్‌లో దిగిపోయి రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో కిరణ్ కుమార్ బంధువులకు సమాచారం అందించారు. ఇక ఇటీవల కృష్ణానది సమీపంలో ఒక కుళ్లిపోయిన శవాన్ని గుర్తించారు పోలీసులు. ఫోన్‌లోని సిమ్ కార్డ్ సాయంతో కిరణ్ కుమార్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు అది కిరణ్ కుమార్ శవమే అని గుర్తుపట్టారు.

అయితే కిరణ్ కుమార్ ఆత్మహత్యకు కారణం ఫస్ట్ నైట్ అని తల్లి విజయలక్ష్మి వెల్లడించింది. ఫస్ట్‌నైట్‌ అంటే భయపడ్డాడని, తన స్నేహితులు ధైర్యం చెప్పినప్పటికీ కిరణ్ కుమార్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది. అయితే శోభనం అంటే చాలామందిలో తెలియని ఆందోళన, భయం ఉంటుంది. సైకిలాజికల్‌గా ఉండే ఆ భయాన్ని నిపుణుల కౌన్సిలింగ్ ద్వారా తగ్గించుకోవచ్చు. అసలు భయమే లేకుండా చేయవచ్చు.

ఈ మాటలు విన్నవారికి కామెడీలా ఉంటుంది. కానీ మానసికంగా ఉండే సమస్యలకు సరైన చికిత్స తీసుకోకపోతే ఇలా ప్రాణాలు తీసుకోవడానికి కూడా కొందరు వెనకాడరు. ఇది చూసిన తర్వాత ఇలాంటి భయం ఉన్న చాలామంది పెళ్లి చేసుకోవాలన్నా భయపడతారు. అలాంటివారు పెళ్లికి ముందే నిపుణులతో కౌన్సిలింగ్ తీసుకుంటేనే బెటర్. అలాకాకుండా బలవంతంగా పెళ్లి చేయడం వల్ల ఇలాంటి అనర్థాలు చోటుచేసుకుని.. మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story