అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..!

అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..!
అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. పాలసముద్రంలోని కియా కార్ల పరిశ్రమ అనుబంధ సంస్థ లోటస్‌ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది.

అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. పాలసముద్రంలోని కియా కార్ల పరిశ్రమ అనుబంధ సంస్థ లోటస్‌ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది.. సంస్థలో పనిచేస్తున్న 20 మంది కూలీలకు చెందిన నివాస గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి.. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నాలు చేశారు.. ఫైర్‌ సిబ్బందికి ఫోన్‌ చేశారు.. అయితే, వారి నుంచి సరైన స్పందన రాలేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు.. గృహాలు అగ్నికి ఆహుతవడంతో వారంతా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story