అక్టోబర్ 5నుంచి స్కూల్స్ రీ ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నాం: ఏపీ మంత్రి

అక్టోబర్ 5నుంచి స్కూల్స్ రీ ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నాం: ఏపీ మంత్రి
అక్టోబర్ 5 నుంచి స్కూల్స్ పున: ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

అక్టోబర్ 5 నుంచి స్కూల్స్ పున: ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కేంద్రం నుంచి అన్‌లాక్ 5 మార్గదర్శకాలు విడుదలైన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి అన్నారు. విద్యావ్యవస్థలో పలు సంస్కరణలను చేస్తున్నామని అన్నారు. ఇంజనీరింగ్ మోడల్ కరికులంను తీసుకొచ్చామని.. సీఎం ఆలోచన మేరకు స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్న్‌షిప్‌తో వ్యవస్థ తీసుకొచ్చామన్నారు. జాతీయ విద్యా పాలసీ రాకముందే సీఎం ఈ విధమైన ఆలోచనలు చేశారని అన్నారు. ఇప్పటికే విద్య కానుక సిద్దం చేశామని మంత్రి పేర్కొన్నారు. సీఎం జగన్ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. డిగ్రీ నుంచి బయటకు రాగానే ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యత లభించేలా సంస్కరణలు చేపడుతున్నామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story