ఏపీలో కరోనా టీకా మహోత్సవ్ పై సందిగ్ధత..!

ఏపీలో కరోనా టీకా మహోత్సవ్ పై సందిగ్ధత..!
ఏపీలో కరోనా వ్యాక్సిన్ నిల్వలు నిండుకుంటున్నాయి. నేటి నుంచి టీకా మహోత్సవ్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినా.. అందుకు తగ్గట్లు రాష్ట్రంలో టీకాలు లేవని ప్రభుత్వం చెబుతోంది.

ఏపీలో కరోనా వ్యాక్సిన్ నిల్వలు నిండుకుంటున్నాయి. నేటి నుంచి టీకా మహోత్సవ్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినా.. అందుకు తగ్గట్లు రాష్ట్రంలో టీకాలు లేవని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే 25 లక్షల డోసులు పంపించాలని కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో టీకా మహోత్సవ్ పై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షన్నర డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇవి పూర్తిగా ఒక్క రోజుకు కూడా సరిపోవని అధికారులు చెబుతున్నారు.

ఇక టీకా ఉత్సవ్‌ అంటే కనీసం 10 లక్షల మందికైనా టీకా వేయాలి. దీంతో అధికారులు చేతులెస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ కేంద్రాల్లో నిల్వలు లేకపోవడంతో నో స్టాక్ బోర్డులో పెట్టే పరిస్థితి నెలకొంది. విశాఖలో అత్యల్పంగా 500 డోసులు, విజయవాడలో అత్యధికంగా 32వేల డోసులు ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో టీకా ఉత్సవ్‌ ఎలా నిర్వహిస్తారు? ఎంతమందికి డోసులు అందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆరోగ్య శాఖ ముందస్తు ప్రణాళికలు సరిగ్గా వేసుకోకపోవడం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా వ్యాక్సిన్‌ సరఫరా చేయకపోవడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story