AP Government : విమర్శలపాలవుతున్న జగన్‌ సర్కార్‌ నిర్ణయాలు..!

AP Government : విమర్శలపాలవుతున్న జగన్‌ సర్కార్‌ నిర్ణయాలు..!
AP Government : జగన్‌ సర్కార్‌ తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శలపాలవుతున్నాయి.. రాష్ట్రంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఎయిడెడ్‌ విద్యాసంస్థల ఉసురు తీస్తోందని విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి..

AP Government : జగన్‌ సర్కార్‌ తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శలపాలవుతున్నాయి.. రాష్ట్రంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఎయిడెడ్‌ విద్యాసంస్థల ఉసురు తీస్తోందని విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.. ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని, వారి సిబ్బందిని, భవనాలను, స్థలాలను ఇచ్చేయాలని ఒత్తిడి చేయడంపై ఫైరవుతున్నాయి.. విద్యాశాఖ అధికారుల సాయంతో ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై ఒత్తిడి పెంచుతూ లక్షలాది మంది విద్యార్థులను రోడ్డున పడేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటూ జారీ చేసిన జీవోతో విజయవాడలో ప్రతిష్టాత్మకమైన మాంటిస్సోరీ ఉన్నత పాఠశాల మూతపడింది. ఇక్కడ పనిచేస్తున్న 13 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం తీసేసుకోవడంతో పాఠశాలను పూర్తిగా మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. టీసీలు తీసుకుని వేరే స్కూళ్లలో చేరాలని విద్యార్థులకు సూచించడంతో విద్యార్థులంతా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 1972 ఎయిడెడ్ పాఠశాలలు ఉండగా... వీటిలో లక్షా 97 వేల 291 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రాంటు ఇస్తుండటంతో తక్కువ ఫీజులతోనే స్కూళ్లను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం గ్రాంట్‌ నిలిపివేసి, ఉపాధ్యాయులను తీసేసుకోవడంతో 8, 9 ,10 తరగతులు చదువుతున్న విద్యార్థులు వేరే పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని టీడీపీ నేతలు ఫైరవుతున్నారు. ఎయిడెడ్ వ్యవస్థ రద్దుతో కేంద్రం ఇచ్చే 50 శాతం నిధులు ఆగిపోతాయని ఆ పార్టీ నేత అశోక్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. 12 కాలేజీల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎయిడెడ్ కాలేజీల స్థలాలు, వాటి ఆస్తులను స్వాధీనం చేసుకొని అన్యాయానికి పాల్పడాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనబడుతోందన్నారు. 9వేల మంది టీచింగ్ స్టాఫ్, 5 వేల నాన్ టీచింగ్ స్టాఫ్‌ని ప్రభుత్వం తీసుకుంటే పనిచేస్తున్నవారు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు.

వైసీపీ ప్రభుత్వం అవగాహన లేక రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేసిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా విమర్శించారు. 50 సంత్సరాలుగా పేదలకు నాణ్యమైన విద్యను అందించే మాంటిస్సోరీ లాంటి విద్యా సంస్థలు మూతపడుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దేశ వ్యాప్తంగా చరిత్ర ఉన్న లయోలా విద్యా సంస్థలు కూడా జగన్ దెబ్బకు మూసివేసే పరిస్తితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్‌మెంట్ రాక ఇప్పటికే చాలా మంది పేద విద్యార్థులు చదువు మానేశారని... ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలను వైసీపీ కొట్టేయలని చూస్తోందని.. అందుకే అవి మూతపడే విధంగా జీవోలు ఇస్తున్నారని మండిపడ్డారు. పేద విద్యార్థులకు టీడీపీ అండగా ఉండి పోరాడుతుందని బోండా ఉమా స్పష్టం చేశారు. (ఫైల్‌ షాట్స్‌ వాడుకోండి)

అటు ఎయిడెడ్‌ వ్యవస్థ రద్దుపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థను వివస్త్రను చేస్తూ అవస్థలకు గురిచేయడం బాధాకరమని ఎంపీ రఘురామ మండిపడ్డారు. ఎయిడెడ్‌ విధానంలో ఉన్న 1,972 పాఠశాలలు, 150 కళాశాలల విలీనం ముసుగులో భూదాహంతో స్థల యజ్ఞం చేస్తున్నారని ఫైరయ్యారు.

మరోవైపు ఈ అంశం హైకోర్టు దృష్టికి కూడా వెళ్లింది. ప్రభుత్వంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిడెడ్‌ విద్యాసంస్థల అంగీకారాన్ని బలవంతంగా తీసుకుంటున్నట్లుగా కనబడుతోందని ఫైరైంది. పూర్తి వివరాలు సమర్పించాలని పర్భుత్వ న్యాయవాదిని ఆదేశించింది. మొత్తంగా అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా ఎయిడెడ్‌ విద్యాసంస్థల విషయంలో వెనక్కు తగ్గుతుందా..? చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story