జగన్‌ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ

జగన్‌ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ
Jagan bail Cancel Petition: ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.

Jagan bail Cancel Petition: ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు అనారోగ్యం కారణంగా కౌంటర్ దాఖలు చేయలేకపోతున్నామని కోర్టుకు తెలిపిన సీబీఐ.. లిఖిత పూర్వక వాదనలు సమర్పించేందుకు గడువు కోరింది.. ఆ గడువు నిన్నటితో ముగిసింది.. దీంతో ఇవాళ సీబీఐ తన వాదనలను కోర్టుకు సమర్పించనుంది.

అటు ఈ కేసులో ఇప్పటికే రఘురామతోపాటు జగన్‌ తరపు న్యాయవాదులు లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించారు. షరతులు ఉల్లంఘించారని రఘురామ వాదించగా.. తాము ఒక్క షరతు కూడా ఉల్లంఘించలేదని జగన్‌ తరపు న్యాయవాది వాదించారు. అయితే, ఈ విషయంలో తాము చెప్పాల్సింది ఏమీ లేదని విచక్షణ మేరకు చట్ట ప్రకారం పిటిషన్‌లోని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని సీబీఐ అధికారులు మొదట కోర్టుకు వివరించారు.

ఆ తర్వాత లిఖితపూర్వకంగా వాదనలు సమర్పిస్తామని, ఇందుకు పది రోజుల సమయం ఇవ్వాలని ఈ నెల 14న కోర్టును కోరింది సీబీఐ. దీనికి అంగీకరించిన సీబీఐ కోర్టు.. విచారణను వాయిదా వేసింది. అయితే, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో వాదనల సమర్పణకు మరింత సమయం కావాలని కోరడంతో ఇవాళ్టికి విచారణ వాయిదా పడింది. దీంతో ఇవాళ కోర్టుకు సీబీఐ ఏం చెప్పబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story