AP Current Bill: ఏపీలో షాక్ కొట్టనున్న కరెంటు బిల్లులు.. భారీగా పెరుగుదలకు సిద్ధం..

AP Current Bill: ఏపీలో షాక్ కొట్టనున్న కరెంటు బిల్లులు.. భారీగా పెరుగుదలకు సిద్ధం..
AP Current Bill: ఏపీలో ఇకపై కరెంట్‌ బిల్లులే షాక్‌ కొట్టబోతున్నాయి. ఛార్జీలు భారీగా విధించబోతున్నారు.

AP Current Bill: ఏపీలో ఇకపై కరెంట్‌ బిల్లులే షాక్‌ కొట్టబోతున్నాయి. కరెంట్‌ శ్లాబులను కుదించి ఛార్జీలు భారీగా విధించబోతున్నారు. ఇప్పటి వరకు ఎస్టీలకు 50 యూనిట్ల దాకా ఉచితంగా కరెంటు ఇస్తున్నారు. కానీ, ఈ శ్లాబును 30 యూనిట్లకే పరిమితం చేయబోతున్నారు. 50 యూనిట్ల శ్లాబును రెండుగా చేస్తున్నారు. 30 యూనిట్ల వరకు పరిమితం చేసి యూనిట్‌కు రూపాయి 45పైసలే వసూలు చేయబోతున్నారు. 31 నుంచి 75 యూనిట్ల వరకూ 2 రూపాయల 80 పైసల చొప్పున ఛార్జీ విధిస్తారు.

దీనివల్ల తొలి 30 యూనిట్ల వరకూ 43 రూపాయలు, మిగిలిన 20 యూనిట్లకు 56 రూపాయలు కట్టాలి. రెండూ కలిపి 99 రూపాయల బిల్లు వస్తుంది. గతంలో 50 యూనిట్లు వాడేవారికి 72 రూపాయల బిల్లు మాత్రమే వచ్చేది. అంటే పేదవాళ్లపై ఏకంగా 26 రూపాయల అదనపు భారం పడబోతోంది. ఇకపై 100 యూనిట్ల వరకు కరెంట్ వాడితే యూనిట్‌కు 4 రూపాయలు, 200 యూనిట్లకు కాల్చితే 5 రూపాయలు, 300 యూనిట్లకు మీటర్ తిరిగితే 7 రూపాయలు, 300 యూనిట్లకు పైన కరెంట్ వాడితే యూనిట్‌కు 7 రూపాయల 50 పైసల చొప్పున విద్యుత్‌ను అందిస్తామని డిస్కమ్‌లు ఏపీఈఆర్‌సీకి నివేదించాయి.

ఈ లెక్కన మున్ముందు కరెంట్ ఛార్జీల వాయింపు మామూలుగా ఉండదని ఏపీ జనం మాట్లాడుకుంటున్నారు. చివరికి వంద యూనిట్ల వరకు కరెంట్ వాడినా నాలుగు రూపాయలు విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పేదవాళ్లకు ఈ కరెంట్ ఛార్జీలు తీవ్ర భారంగా మారతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సర్దుబాటు పేరుతోనూ ట్రూఅప్ ఛార్జీలు వేయబోతున్నారు. సాధారణంగా విద్యుత్‌ కొనుగోళ్లు, ఇతర వ్యయాలు పెరిగితే వాటిని మూడు నెలలకోసారి సవరించుకోవచ్చు. దీంతో ట్రూఅప్‌ పేరిట భారీగానే భారం వేయబోతున్నారని విద్యుత్‌ రంగ నిపుణులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story