మంచి బ్రాండ్లు, కూల్‌ బీర్లు అందుబాటులో ఉంచండి.. బ్యాలెట్‌ బాక్స్‌ లో మందుబాబు విజ్ఞప్తి..!

మంచి బ్రాండ్లు, కూల్‌ బీర్లు అందుబాటులో ఉంచండి.. బ్యాలెట్‌ బాక్స్‌ లో మందుబాబు విజ్ఞప్తి..!
ఊరందరిదీ ఒక దారైతే, ఉలిపికట్టది మరోదారి అన్నట్లుంది ఈ మందు బాబు తీరు. ఓటు అనే ఆయుధాన్ని ఏకంగా విజ్నప్తి పత్రంగా మార్చేశాడు.

ఊరందరిదీ ఒక దారైతే, ఉలిపికట్టది మరోదారి అన్నట్లుంది ఈ మందు బాబు తీరు. ఓటు అనే ఆయుధాన్ని ఏకంగా విజ్నప్తి పత్రంగా మార్చేశాడు. వివిధ రకాల బ్రాండ్లు తాగలేక విసిగిపోయా... మంచి మద్యం బ్రాండ్లను, కూల్‌ బీర్లను అందుబాటులో ఉంచాలని బ్యాలెట్‌ పేపర్‌ తో పాటు విజ్నప్తి చిటీలను బ్యాలెట్‌ బాక్స్‌ లో వేశాడు. ఇది అనంతపురం పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ లో వెలుగుచూసింది. నల్లచెర్వు మండలం కడవవాండ్లపల్లి ఎంపీటీసీ బ్యాలెట్‌ బ్యాక్సులు ఓపెన్‌ చేసి ఓట్లను లెక్కిస్తున్న క్రమంలో ఈ చీటీలు బయటపడ్డాయి. నల్లచెరువు మందుబాబుల యూత్‌ అధ్యక్షుడు అని రాసి ఉండటం కొసమెరుపు.




Tags

Read MoreRead Less
Next Story