AP Elections: ఎన్నికలు పూర్తి.. కౌంటింగ్ మొదలు.. ఏపీలో మొదలైన ఉత్కంఠ..

AP Elections (tv5news.in)

AP Elections (tv5news.in)

AP Elections: ఏపీ వ్యాప్తంగా సోమవారం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కౌంటింగ్‌ జరగనుంది.

AP Elections: ఏపీ వ్యాప్తంగా సోమవారం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కౌంటింగ్‌ జరగనుంది. నెల్లూరు కార్పోరేషన్‌తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లా దర్శి, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం, చిత్తూరు జిల్లా కుప్పం, కర్నూలు జిల్లా బేతం చర్ల , కడప జిల్లాలో కమలాపురం, రాజంపేట, అనంతపురం జిల్లాలో పెనుకొండ మున్సిపాలిటీలు పోలింగ్ జరిగింది.

మొత్తం 328 వార్డులకు.. ఎన్నికలు జరగ్గా ఇందులో 17 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలినవాటికి కౌంటింగ్‌ జరిగనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. నెల్లూరు కార్పోరేషన్‌లో 54 వార్డులు ఉండగా..అందులో 8 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 46 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 52.25 శాతం మంది ఓటు వేశారు.

ఇక కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో మొత్తం 31 వార్డులకు ఎన్నికలు జరిగాయి. కొండపల్లిలో 29 వార్డులకు ఎన్నికలు జరిగాయి. కుప్పంలో 25 వార్డులు ఉండగా.. ఇందులో ఒక వార్డు ఏకగ్రీవమైంది. మిగిలిన 24 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 37,664 మంది ఓటర్లు ఉండగా 28,942 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కడప జిల్లా రాజంపేటలో 29 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. కమలాపురంలో 20 వార్డులకు ఎన్నికలు జరిగాయి. గుంటూరు జిల్లాలో దాచేపల్లిలో ఒక వార్డు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అటు గురజాలలోనూ ఆరు వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 14 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ప్రకాశం జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో 20 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అటు ప్రకాశం జిల్లా దర్శిలో ఒక వార్డు ఏకగ్రీవం కాగా.. 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి.

పశ్చిమగోదావరి జిల్లా ఆకవీడులో.. 20 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇక అనంతపురం జిల్లా పెనుకొండలో.. 20 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మరోవైపు కర్నూలు జిల్లా బేతం చెర్లలో.. 20 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 311 వార్డుల ఫలతాలు వెలువడనున్నాయి. మరోవైపు కుప్పం ఎన్నికల కౌంటింగ్ పై టీడీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటింగ్‌ను పరిశీలించేందుకు ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ ప్రభాకర్ రెడ్డిని నియమించాలని ఆదేశాలు ఇచ్చింది.

ఈ మేరకు ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని ఆదేశింది హైకోర్టు. టీడీపీ కోరినట్లుగా కుప్పంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది. కుప్పంలో వైసీపీ అరాచకాలపై ఇప్పటికే టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు లెక్కింపులోనూ అక్రమాలు జరిగే అవకాశం ఉండటంతో.. అన్ని జాగ్రత్తలు తీసుకుటోంది టీడీపీ. అందుకే హైకోర్టును ఆశ్రయించింది. కౌంటింగ్ వేళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story