AP High Court : ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం..!

AP High Court  : ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం..!
ఏపీలోని ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా ధర్మసనం రాష్ట్రప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీలోని ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా ధర్మసనం రాష్ట్రప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం అంశంలో స్పష్టమైన సమాచారం లేదంటూ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసందర్బంగా ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం అంశంలో డీఈవో జారీ చేసిన ఆదేశాలను సీజే చదివి వినిపించారు. దీనికి బదులుగా అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు మాత్రమే వాదనలు వినిపిస్తున్నామని ప్రభుత్వం తరుపున న్యాయవాది తెలిపారు. రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనం చేయాలని యాజమాన్యాలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని హైకోర్టుకు పిటిషనర్ తరుపు న్యాయవాది ముతుకుమల్లి విజయ్ వెల్లడించారు. దీంతో తప్పుడు సమాచారం ఇస్తున్న అధికారుల వివరాలు ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయంలో ఈనెల 29వ తేదీన స్వయంగా కోర్టుకు హాజరుకావాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చినవీరభద్రుడికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 29కి కోర్టు వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story