ఏపీ ఎన్నికలు.. వాలంటీర్ల అంశంపై హైకోర్టులో ముగిసిన విచారణ

ఏపీ ఎన్నికలు.. వాలంటీర్ల అంశంపై హైకోర్టులో ముగిసిన విచారణ
హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌‌పై విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్‌ చేసింది హైకోర్టు.

వాలంటీర్ల‌పై ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ.. హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌‌పై విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్‌ చేసింది హైకోర్టు. వాదనల సందర్భంగా.. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీకి ఇబ్బంది లేదని ధర్మాసనానికి ఎస్ఈసీ తెలిపింది. రాజకీయ పక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకే తాము చర్యలు తీసుకున్నామని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు. లబ్దిదారులతో నేరుగా టచ్‌లోకి వెళ్లి బెదిరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయని ధర్మాసనానికి చెప్పిన న్యాయవాది... దాదాపు 600 ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు.

లబ్దిదారులను అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని వాలంటీర్లు బెదిరిస్తున్నారని పిటీషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాలంటీర్లను స్ధానిక నేతలు ప్రభావితం చేసి అధికార పార్టీకి అనుకూలంగా మలచుకుంటున్నారని తెలిపారు. పోలింగ్‌ సందర్భంగా ఓటర్‌ స్లిప్పుల పంపిణీలో కూడా వాలంటీర్లు జోక్యం చేసుకుంటున్నారన్నారు. అధికార పార్టీ అనుచరులకు స్లిప్పులు ఇచ్చి, ప్రత్యర్ధి వర్గాలకు స్లిప్పులు ఇవ్వటం లేదన్నారు. అందువలనే వాలంటీర్ల జోక్యాన్ని ఎన్నికల ప్రక్రియలో నివారించాలని పిటీషనర్లు కోరారు. వాదనలు ముగియటంతో ఉత్తర్వులను హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది.



Tags

Read MoreRead Less
Next Story