రేషన్ పంపిణీలో నేతల జోక్యం వద్దు.. పార్టీల రంగులు వద్దు : హైకోర్టు

రేషన్ పంపిణీలో నేతల జోక్యం వద్దు.. పార్టీల రంగులు వద్దు :  హైకోర్టు
ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రేషన్ పంపిణీలో నేతల జోక్యం, పార్టీల రంగులు వద్దని స్పష్టం చేసింది.

ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రేషన్ పంపిణీలో నేతల జోక్యం, పార్టీల రంగులు వద్దని స్పష్టం చేసింది. రేపటి నుంచి ఇంటింటికీ రేషన్‌పై .ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్‌మోషన్‌పై విచారించిన హైకోర్టు. ఓ ప్రణాళిక సిద్ధం చేసుకుని రెండ్రోజుల్లో SECని కలవాలని ఆదేశించింది. 5 రోజుల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని SECకి సూచించింది న్యాయస్థానం. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా సంక్షేమ పథకాలు ఎవరూ సొంత డబ్బుతో చేయరని వ్యాఖ్యానించింది. ట్యాక్స్ పేయర్స్ డబ్బుల నుంచే పథకాలు అమలు చేస్తారని గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది..పేదలకు సంబంధించిన పథకం కాబట్టి SEC సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించింది న్యాయస్థానం.

Tags

Read MoreRead Less
Next Story