ఏపీ మంత్రుల ప్రొఫైల్..

ఏపీ మంత్రుల ప్రొఫైల్..

1)బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి)

పుట్టినతేది - జులై 9, 1958

విద్యార్హత - బీఏ

ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు

1992-99 విజయనగరం డీసీసీబీ చైర్మన్

1996, 1998ల్లో బొబ్బిలి ఎంపీగా కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓటమి

1999లో ఎంపీగా ఎన్నిక

2004, 2009లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నిక

వైఎస్ ప్రభుత్వంలో తొలిసారి మంత్రిపదవి

పంచాయితీరాజ్, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు

కిరణ్‌కుమార్‌ రెడ్డి కేబినెట్‌లో రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు

2015లో కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన బొత్స

2019 - చీపురుపల్లి ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నిక

--------------------------

2.కొడాలి వెంకటేశ్వరరావు(కొడాలి నాని-గుడివాడ)

విద్యార్హత -ఎస్‌ఎస్‌సీ

కృష్ణా జిల్లాలో ప్రజాదరణ ఉన్న నేత

2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక

2004, 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నిక

2013లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిక

2014, 2019 వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక

మంత్రిగా తొలిసారి అవకాశం

--------------------------

3.మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు)

విద్యార్హత : బీఏ

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత

గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ బాధ్యతలు

2006లో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రవేశం

2006లో ఫిరంగిపురం జడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపు

2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపు

2012లో ఉపఎన్నికలో వైసీపీ తరుపున ప్రత్తిపాడు నుంచి గెలుపు

2019లో డొక్కా మాణిక్యవరప్రసాద్ పై విజయం

--------------------------

4.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు)

విద్యార్హత ఎంఏ, పీహెచ్ డీ

రాజకీయాల్లోకి రాకముందు కాంట్రాక్టర్

గతంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ, అటవీశాఖ మంత్రి

1978లో పీలేరు నుంచి జనతా పార్టీ తరపున తొలిసారిగా పోటీ చేసి ఓటమి

1985 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం

1994లో ఓటమి పాలై 1999, 2004లోనూ పీలేరు నుంచి గెలుపు

పుంగనూరు నుంచి 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం

2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిక

2014, 2019ల్లో వైసీపీ అభ్యర్థిగా గెలుపు

1989, 1999, 2004, 2009, 2019లో అసెంబ్లీకి ఎన్నిక

2009 నుంచి 2010 వరకు అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు

----------------

5. ముత్తంశెట్టి శ్రీనివాస్ (భీమిలి)

జననం : జూన్ 12, 1967

విద్యార్హత -బీకాం

అవంతి విద్యాసంస్థల అధిపతి

2009 - పీఆర్పీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక

2014 - అనకాపల్లి ఎంపీగా టీడీపీ నుంచి గెలుపు

2019- రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక

ఎన్నికలకు ముందుకు వైసీపీలో చేరిక

------------------------------

6. పిల్లి సుభాష్ చంద్రబోస్(ఎమ్మెల్సీ)

జననం : ఆగస్టు 8, 1950

విద్యార్హత : బీఎస్సీ

1978లో రాజకీయ ప్రవేశం

1989లో రామచంద్రపురం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపు

1994, 1999 ఎన్నికల్లో ఓటమి

2004లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం

2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపు

2006 నుంచి 2010 వరకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు

వైఎస్, రోశయ్య కేబినెట్ లో మంత్రి పదవిగా బాధ్యతలు

వైసీపీ ఆవిర్భావం తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా

2014 నుంచి వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగింపు

ఇటీవల ఎన్నికల్లో మండపేట నుంచి ఓటమి

------------------------------

7. అనిల్ కుమార్ యాదవ్ ( నెల్లూరు )

విద్యార్హత - బీడీఎస్

నెల్లూరు కార్పొరేటర్‌గా రాజకీయరంగ ప్రవేశం

బీసీ వర్గం నాయకుడిగా గుర్తింపు

2009లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి

2012లో వైసీపీలో చేరిక

జగన్‌కు విశ్వసనీయుడిగా పేరు

2014, 2019లో ఎమ్మెల్యేగా ఎన్నిక

తొలిసారి మంత్రి పదవి

------------------------------

8.మోపిదేవి వెంకటరమణ

1962, నిజాంపట్నంలో జననం

విద్యార్హత డిగ్రీ

1987లో నిజాంపట్నం మండలాధ్యక్షుడిగా ఎన్నిక

1989, 1994ల్లో కూచినపూడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి

1999, 2004 ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నిక

2009లో రేపల్లె నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా గెలుపు

వైఎస్‌ కేబినెట్‌లో ఓడరేవులు, పెట్టుబడులు, మౌలిక వసతులు,

సాంకేతిక విద్య, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు

2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో ఎక్సైజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు

2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి

ఉభయసభల్లోనూ సభ్యుడు కాకుండానే మంత్రిగా అవకాశం

త్వరలోనే మండలిలోకి మోపిదేవి ఎంట్రీ

------------------------------

9. ధర్మాన కృష్ణదాస్‌ (నరసన్నపేట)

విద్యార్హత: బీకాం

మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక

మాజీ మంత్ర ధర్మాన ప్రసాదరావుకు సోదరుడు

జగన్ కు నమ్మిన బంటు

2004, 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం

2012 వైసీపీ తరపున ఉపఎన్నికల్లోనూ గెలుపు

2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి

2019లో నరసన్నపేట ఎమ్మెల్యేగా గెలుపు

------------------------------

10. పాముల పుష్ప శ్రీవాణి( కురుపాం)

విద్యార్హత: బీఎస్సీ, బీఈడీ

2014లో మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు కుమారుడు పరిక్షిత్ రాజును వివాహం

2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపు

2019 ఎన్నికల్లో రెండవసారి ఎమ్మెల్యేగా విజయం

------------------------------

11 పినిపే విశ్వరూప్‌( అమలాపురం)

విద్యార్హత: బీఎస్సీ, బీఈడీ

ముమ్మిడివరం నుంచి 1998 ఉపఎన్నికల్లో, 1999 ఎన్నికల్లో ఓటమి

2004లో ముమ్మిడివరం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపు

2009లో అమలాపురం నుంచి విజయం

2010 నుంచి 2013 వరకు గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రిగా బాధ్యతలు

2014 ఎన్నికలకు అయిదు నెలల ముందు వైసీపీలో చేరిక

2014లో అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి

వైఎస్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంల్లో మంత్రిగా బాధ్యతలు

2019లో అమలాపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపు

------------------------------

12. కురసాల కన్నబాబు(కాకినాడ రూరల్‌)

విద్యార్హత: బీకాం, ఎంఏ

రెండుసార్లు ఎమ్మెల్యే

సీనియర్ రాజకీయ నేత

జర్నలిజం వఈత్తిని ప్రజారాజ్యం పార్టీ అవిర్భావం తరువాత రాజకీయాల్లోకి

2009లో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా విజయం

2014లో సతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి

2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపు

------------------------------

13. తానేటి వనిత(కొవ్వూరు)

విద్యార్హత: ఎమ్మెస్సీ

రాజకీయ కుటుంబం

రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం

2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున గోపాలపురం ఎమ్మెల్యేగా గెలుపు

2013లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిక

2014లో వైసీపీ తరఫున కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమి

2019లో వైసీపీ నుంచి కొవ్వూరు ఎమ్మెల్యేగా విజయం

--------------------------

14. చెరుకువాడ శ్రీరంగనాథరాజు (ఆచంట)

విద్యార్హత: మెట్రిక్యులేషన్

రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం

1995 నుంచి ప.గో జిల్లా రైసుమిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు

2004లో అత్తిలి నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపు

2018లో వైసీపీలో చేరి ఆచంట నియోజకవర్గ కన్వీనరుగా బాధ్యతలు

2019లో ఆచంట నుంచి ఎమ్మెల్యేగా విజయం

----------------------------

15. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని)

ఏలూరు నియోజకవర్గం

విద్యార్హత: బీకాం

వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం

1994లో స్వతంత్ర, 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి

2004, 2009ల్లో ఏలూరు ఎమ్మెల్యేగా గెలుపు

2016 నుంచి వైసీపీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు

2017 నుంచి ఎమ్మెల్సీగా పనిచేస్తున్న ఆళ్ల

2019లో వైసీపీ తరఫున ఏలూరు నుంచి పోటీ చేసి గెలుపు

------------------------

16. వెల్లంపల్లి శ్రీనివాస్‌ విజయవాడ (పశ్చిమ)

విద్యార్హత: పదో తరగతి

రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం

విజయవాడ కేంద్రంగా పలు వ్యాపారాలు

2009లో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు

2014లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి

2019లో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం

--------------------------

17. పేర్ని వెంకట్రామయ్య (నాని)

మచిలీపట్నం నియోజకవర్గం

విద్యార్హత: బీకాం

రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌

యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా రాజకీయాల్లోకి

1999లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం

2004, 2009ల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపు

2014 ఎన్నికల్లో కొల్లు రవీంద్ర చేతిలో ఓటమి

2019 ఎన్నికల్లో కొల్లు రవీంద్రపై విజయం

---------------------

18. బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)

విద్యార్హత: బీకాం

సీఎం జగన్‌కు బంధువు

ఐదుసార్లు ఎమ్మెల్యే

1999, 2004, 2009ల్లో వరుసగా కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలుపు

వైఎస్‌, రోశయ్య మంత్రివర్గాల్లో మంత్రిగా బాధ్యతలు

వైఎస్‌ మరణానంతరం మంత్రి పదవికి రాజీనామా

2012 ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపు

2014 ఎన్నికల్లో ఓటమి

2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపు

------------------------

19. ఆదిమూలపు సురేష్‌‌( యర్రగొండపాలెం)

విద్యార్హత- ఎంటెక్‌

మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం

1985-90 మధ్య ఏపీ పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌శాఖలో ఏఈఈ బాధ్యతలు

1989లో సివిల్‌ సర్వీసు పరీక్షలో ఉత్తీర్ణత

రైల్వేలో డిప్యూటీ ఫైనాన్షియల్‌ అడ్వయిజర్‌గా పనిచేసిన సురేష్‌

వైఎస్‌ పిలుపుతో 2009లో ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి

యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ తరఫున గెలుపు

2014 ఎన్నికల్లో వైసీసీ తరఫున సంతనూతలపాడు నుంచి విజయం

2019 ఎన్నికల్లో యర్రగొండపాలెం నుంచి గెలుపు

Tags

Read MoreRead Less
Next Story