విశాఖ జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం!

విశాఖ జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం!
విశాఖ జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొదటి దశలో అనకాపల్లి డివిజన్‌లో ఎన్నికలు జరుగగా... రెండో దశలో నర్సీపట్నం డివిజన్‌లో జరుగనున్నాయి.

విశాఖ జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొదటి దశలో అనకాపల్లి డివిజన్‌లో ఎన్నికలు జరుగగా... రెండో దశలో నర్సీపట్నం డివిజన్‌లో జరుగనున్నాయి. నర్సీపట్నం పరిదిలో 239 గ్రామపంచాయతీలు, 2 వేల 584 వార్డులకు ఎన్నికలు జరుగబోతున్నాయి. 581 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీపడుతున్నారు. డివిజన్‌లో మొత్తం 4 లక్షల 69 వేల 583 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 2 లక్షల 30 వేల 252 మంది పురుష ఓటర్లు, 2 లక్షల 39 వేల 313 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 18 మంది ఉన్నారు.

పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 6 వేల 470 మంది అధికారులు ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. వీరిలో 2 వేల 653 మంది ప్రిసైడింగ్ అధికారులు ఉన్నారు. మిగతా అధికారులు 3 వేల 817 మంది ఉన్నారు. 10 మండలాలకు సంబంధించి 44 జోన్లు, 69 రూట్లు ఏర్పాటు చేశారు. ఇక 400 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 2 వేల 184 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story