పథకాలు ఆపేస్తామని బెదిరించే వాలంటీర్ల వీడియోలను పంపిస్తే పదివేల పారితోషికం : టీడీపీ

పథకాలు ఆపేస్తామని బెదిరించే వాలంటీర్ల వీడియోలను పంపిస్తే పదివేల పారితోషికం : టీడీపీ
టీడీపీకి ఓటు వేస్తే పథకాలు ఆపేస్తామని బెదిరించే వాలంటీర్ల వీడియోలను పంపిస్తే పదివేల పారితోషికం ఇస్తామని ప్రకటించింది టీడీపీ.

టీడీపీకి ఓటు వేస్తే పథకాలు ఆపేస్తామని బెదిరించే వాలంటీర్ల వీడియోలను పంపిస్తే పదివేల పారితోషికం ఇస్తామని ప్రకటించింది టీడీపీ. ఇసుకపై 5వేల కోట్ల దోపిడీకి తెరలేపారని ఆరోపించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మద్య నిషేధం పేరుతో రాష్ట్ర ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. ఈ రెండేళ్లలో 22 మంది వైసీపీ ఎంపీల్లో ఒక్కరైనా పోరాటం చేశారా? మోదీని గాని, కేంద్ర మంత్రులను గాని కలిసి రాష్ట్రం పడుతున్న కష్టాలపై అడిగారా? అని ప్రశ్నించారు.

పోలవరం నిర్మాణానికి 50వేల కోట్లకుపైగా ఖర్చవుతుందని తుది అంచనాలు రూపొందిస్తే.. వాటిని సాధించుకోవడం సాధ్యం కాని అసమర్ధ ప్రభుత్వం అని విమర్శించారు. పోలవరం కోసం రాష్ట్రం 600 కోట్లు ఖర్చుపెడితే.. ఆయన ప్రచారం కోసం 400 కోట్లు ఖర్చుపెట్టుకున్నాడని ఆరోపించారు. అభివృద్ధి కంటే ప్రచారానికే ఎక్కువ ఖర్చు పెట్టారని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story