Bheemla Nayak: ఏపీలో 'భీమ్లా నాయక్' సినిమా బెనిఫిట్ షోలు లేవు.. జగన్ సర్కార్ ఆర్డర్

Bheemla Nayak: ఏపీలో భీమ్లా నాయక్ సినిమా బెనిఫిట్ షోలు లేవు.. జగన్ సర్కార్ ఆర్డర్
Bheemla Nayak: భీమ్లా నాయక్‌ కోసం ఏపీలో భిన్నమైన పరిస్థితి కనబడుతోంది..

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ సినిమా కోసం తెలంగాణలో అనుకూల వాతావరణం కనిపిస్తుండగా.. ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనబడుతోంది.. తెలంగాణలో పెరిగిన రేట్లతో టికెట్ల విక్రయాలు జరుగుతుండగా ఏపీలో తగ్గించిన రేట్లకు టికెట్లు అమ్మాల్సిందేనంటూ ప్రభుత్వం నుంచి థియేటర్లపై ఒత్తిడి పెరుగుతోంది.. ఏపీలో భీమ్లా నాయక్‌ సినిమా విడుదల సందర్భంగా ప్రభుత్వం ఆంక్షలు విధించడం వివాదాస్పదం అవుతోంది..

పవన్‌ సినిమాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రభుత్వంపై మండిపడుతున్నారు భీమ్లా నాయక్‌ ఫ్యాన్స్‌. పలు రకాలుగా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఫ్యాన్స్‌ ఫైరవుతున్నారు.. పవన్‌ సినిమా కోసమే రాత్రికి రాత్రే కొత్త ఆంక్షలు పెట్టారంటూ మండిపడుతున్నారు.. అటు వాస్తవంగా చూసినా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది..

టికెట్ల రేట్ల విషయంలోనేకాదు.. బెనిఫిట్‌ షో సహా ఐదో షోకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా ఆంక్షలు విధించింది.. ప్రతి జిల్లాలో థియేటర్లకు నోటీసులు ఇచ్చారు. అటు విజయవాడలో పవన్‌ అభిమానుల ఆందోళన చేపట్టారు.. భీమ్లా నాయక్‌ సినిమా బెనిఫిట్‌ షోకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.. ప్రభుత్వం కావాలనే పవన్‌ సినిమాపై కక్ష సాధిస్తోందన్నారు..

ప్రభుత్వం జారీ చేసిన జీవో అభ్యంతరకరంగా ఉందన్నారు.. థియేటర్ల వద్ద సినిమా, పవన్‌ అభిమానుల సందడి తప్ప ఏమీ ఉండదన్నారు.. పక్క రాష్ట్ర ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు అండగా నిలుస్తోందని.. ఏపీలో థియేటర్ల వద్ద ఆంక్షలు కరెక్ట్‌ కాదని అన్నారు. అటు తిరుపతిలో 13 థియేటర్లకు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు..

బెనిఫిట్‌ షోలు వేయరాదని, ఎక్కువ ధరలకు టికెట్లు అమ్మరాదని నోటీసులిచ్చారు.. ప్రభుత్వ ఆదేశాలు అతిక్రమిస్తే థియేటర్లు సీజ్‌ చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.. ప్రభుత్వ తీరుపై పవన్‌ అభిమానులు మండిపడుతున్నారు.. కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందంటూ తిరుపతిలోని గాంధీ విగ్రహం ఎదుట పవన్‌ అభిమానులు ఆందోళన చేపట్టారు.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే సినీ పరిశ్రమపై ఆంక్షలు పెట్టారని ఫైరవుతున్నారు.

పవన్‌పై రాజకీయ దురుద్దేశంతోనే భీమ్లా నాయక్‌ మీద ఆంక్షలు పెడుతున్నారని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ నాయుడు మండిపడ్డారు.. తాను పవన్‌ అభిమానిని కాకపోయినా భీమ్లా నాయక్‌ సినిమా చూస్తానన్నారు. తెలంగాణలో సినిమాను ప్రోత్సహిస్తుంటే ఏపీలో మూలాలు ఉన్న హీరోలను ఆర్థికంగా దెబ్బ కొట్టాలనుకోవడం ముఖ్యమంత్రి జగన్‌కు తగదన్నారు.

అటు గుంటూరులోనూ పవన్‌ అభిమానులు ఆందోళన చేపట్టారు.. భీమ్లా నాయక్‌ మూవీ రిలీజ్‌ సందర్భంగా సాయికృష్ణ థియేటర్‌ దగ్గర బ్యానర్లు ఏర్పాటు చేశారు.. అయితే, ఈ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు.. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలంటూ పవన్‌ అభిమానులు ఆందోళనకు దిగారు. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story