పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ చికెన్ ఎంతంటే?

పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ చికెన్ ఎంతంటే?
కొత్త వైరస్ ఎదోచ్చిన సరే ఫస్ట్ ఎఫెక్ట్ మాత్రం కచ్చితంగా చికెన్ పైన పడుతుంది. కరోనా మొదట్లో చికెన్ తోనే కరోనా వస్తుందంటూ జోరుగా ప్రచారం జరిగింది.

Chicken Price : కొత్త వైరస్ ఎదోచ్చిన సరే ఫస్ట్ ఎఫెక్ట్ మాత్రం కచ్చితంగా చికెన్(chicken) పైన పడుతుంది. కరోనా మొదట్లో చికెన్ తోనే కరోనా(CoronaVirus) వస్తుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత చికెన్ తింటే కరోనా రాదని, కరోనాను తట్టుకొనే రోగనిరోధక శక్తిని ఇస్తుందంటూ వైద్యులు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు బర్డ్‌ ఫ్లూ (bird flu)అనే కొత్త రకం వైరస్ స్ప్రెడ్ అవుతుండడంతో మళ్ళీ చికెన్‌ వ్యాపారులకు, చికెన్‌ ప్రియులను గందరగోళంగా మార్చేసింది.

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వ్యాపారులకి బర్డ్‌ ఫ్లూ పెద్ద షాకే ఇచ్చిందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్‌ అంతగా లేకపోయినప్పటికీ పక్క రాష్ట్రాలలో మాత్రం బాగానే ఉంది. దీనితో కొద్దిరోజులు చికెన్ కి దూరంగా ఉంటే సరిపోతుంది కదా అనే భావన ప్రజల్లో ఏర్పడుతుంది . దీనితో ఇన్నిరోజులు ముక్క తింటేనే ముద్ద దిగని వారంతా.. ఇప్పుడు ముక్క అంటేనే ఆమడదూరం వెళ్తున్నారు. దీనితో చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి.

వారం రోజుల కిందట రూ. 200 రూపాయలకి పైనే ఉన్న కిలో చికెన్‌..ఇప్పుడు 160, 140 రూపాయల మధ్య నడుస్తోంది. ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కేవలం చికెన్ ధరలు మాత్రమే కాదు చేపల ధరలు కూడా తగ్గే అవకాశం లేకపోలేదు అంటున్నారు. అటు కోడిగుడ్లను సైతం తినేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story