Chandrababu Naidu: రెండో రోజు కొనసాగుతున్న చంద్రబాబు దీక్ష..

Chandrababu Naidu: రెండో రోజు కొనసాగుతున్న చంద్రబాబు దీక్ష..
Chandrababu Naidu: వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో చంద్రబాబు ఈ దీక్ష చేపట్టారు.

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు' పేరుతో చంద్రబాబు ఈ దీక్ష చేపట్టారు.

ఈ దీక్ష ఇవాళ రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. నిన్న రాత్రి 10:30 తర్వాత దీక్షా స్థలిపైనే నిద్రించారు చంద్రబాబు. ఉదయం 5 గంటలకు నిద్రలేచిన చంద్రబాబు.... దీక్షను కొనసాగిస్తున్నారు.

అటు... టీడీపీ కేంద్ర కార్యాలయానికి పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తున్న టీడీపీ నేతలు.... ప్రభుత్వంపైనా, పోలీసులపైనా విరుచుకుపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story