Chandrababu: జగన్‌ పన్నుల పాలనను చాటి చెప్పేలా బాదుడే బాదుడు నిర్వహించాలి: చంద్రబాబు

Chandrababu: జగన్‌ పన్నుల పాలనను చాటి చెప్పేలా బాదుడే బాదుడు నిర్వహించాలి: చంద్రబాబు
Chandrababu: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. పార్టీ శ్రేణుల్ని రెడీ చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandrababu: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. పార్టీ శ్రేణుల్ని రెడీ చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇందుకోసం గ్రామకమిటీలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. టీడీపీ సభ్యత్య నమోదు కార్యక్రమంతో పాటు బాదుడే బాదుడుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జగన్‌ పన్నుల పాలనను చాటి చెప్పేలా బాదుడే బాదుడు ఉధృతంగా నిర్వహించాలని టీడీపీ గ్రామ కమిటీలకు పిలుపిచ్చారు.

భారీ ఎత్తున పార్టీ సభ్యత్వ నమోదుకు గ్రామ కమిటీలు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. 163 నియోజకవర్గాల్లోని 3 వేలకు పైగా గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు. ఇక పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు చంద్రబాబు. ఇందుకోసం లోకేష్‌ నేతృత్వంలో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు వంద కోట్ల సాయం అందించినట్లు తెలిపారు చంద్రబాబు.

ఆర్థిక వేత్తల ఆందోళన ఏపీ పరిస్థితికి దర్పణం పడుతోందన్నారు. అటు.. రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై స్పందించారు చంద్రబాబు. బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బైక్‌పై తరలించడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడి మృతదేహాన్ని 90 కిలోమీటర్లు తండ్రి తన బైక్‌పై తీసుకెళ్లిన ఘటన రాష్ట్రంలో ఆరోగ్య దుస్థితిని తెలియజేస్తుందన్నారు.

మొత్తానికి వైసీపీకి చెక్‌ పెడుతూనే.. టీడీపీ శ్రేణుల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. పార్టీ శ్రేణుల్ని రెడీ చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇందుకోసం గ్రామకమిటీలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

టీడీపీ సభ్యత్య నమోదు కార్యక్రమంతో పాటు బాదుడే బాదుడుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జగన్‌ పన్నుల పాలనను చాటి చెప్పేలా బాదుడే బాదుడు ఉధృతంగా నిర్వహించాలని టీడీపీ గ్రామ కమిటీలకు పిలుపిచ్చారు. భారీ ఎత్తున పార్టీ సభ్యత్వ నమోదుకు గ్రామ కమిటీలు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. 163 నియోజకవర్గాల్లోని 3 వేలకు పైగా గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story