Chandrababu: టీడీపీ బ్యానర్లను చించేసిన వైసీపీ కార్యకర్తలు.. చంద్రబాబు పర్యటనకు అడ్డంకులు..

Chandrababu (tv5news.in)

Chandrababu (tv5news.in)

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రెండో రోజు ఆయన కుప్పంలో పర్యటిస్తున్నారు.

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రెండో రోజు ఆయన కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ చెత్త ముఖ్యమంత్రి చెత్త పన్ను వేశారంటూ మండిపడ్డారు. వైసీపీ పాలనలో రౌడీయిజం పెరిగిందని, ఏపీలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. కరెంట్, ఆర్టీసీ ఛార్జీలు పెంచారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం ఇంకా పన్నులు వేస్తుందన్నారు. చెత్త పన్ను కట్టొద్దని.. టీడీపీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని చంద్రబాబు అన్నారు.

ఉదయం వరదరాజస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు చంద్రబాబు. తర్వాత రాధాకృష్ణ రోడ్డులోని మసీదులో ప్రార్ధనలు చేశారు. అనంతరం లక్ష్మీపురం సర్కిల్‌ వద్ద నుంచి చంద్రబాబు రోడ్‌షో ప్రారంభించారు.

అయితే చంద్రబాబు పర్యటనలో వైసీపీ శ్రేణులు ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నించారు. రెండోరోజూ కూడా టీడీపీ బ్యానర్లను కొందరు వైసీపీ కార్యకర్తలు చించివేశారు. చంద్రబాబు పర్యటన దృష్ట్యా టీడీపీ నేతలు, కార్యకర్తలు దారి పొడువునా బ్యానర్లు ఏర్పాటు చేశారు. కర్నాటక సరిహద్దు నుంచి రాళ్లబుడుగూరు వరకు కట్టి ఉన్న టీడీపీ బ్యానర్లను కూల్చివేశారు. దీంతో కుప్పంలో మరోసారి హైటెన్షన్ నెలకొంది. బానర్లు చించివేయడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

లక్ష్మీపురం రోడ్‌ షోలో చంద్రబాబు.. కుప్పం సీఐని అభినందనలు తెలిపారు. తన ప్రత్యేక కాన్వాయ్‌లో సీఐని పిలిపించుకున్న చంద్రబాబు, వైసీపీ నేతల దౌర్జన్యాలు, జరిగిన సంఘటనలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీతి నిజాయితీ గల పోలీసులు, అధికారులకు తాను అండగా ఉంటుందని చంద్రబాబు అన్నారు.

ఉదయం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో చంద్రబాబు టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ కార్యకర్తల నుంచి వినతులను స్వీకరించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలు, అభ్యర్థులు, వార్డు సభ్యుల ఎంపికపై చర్చించారు. అనంతరం ఎన్నికల వ్యూహాలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు పర్యటనతో పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సహం వచ్చిందని స్థానిక టీడీపీ నేత చినబాబు అన్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని అమర్నాథ్‌రెడ్డి చెప్పారు. అంతకుముందు.. చంద్రబాబుకు అడుగడుగునా జనం నీరాజనాలు పలుకగా.. హారతులతో మహిళలు ఆశీర్వదించి ఘనస్వాగతం పలికారు.

టీడీపీ అధినేత చంద్రబాబు రెండోరోజు కుప్పం పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. లక్ష్మీపురం, సామగుట్టపల్లిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. తర్వాత పొలాల్లో రైతుల వద్దకెళ్లి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు చంద్రబాబు.

కుప్పంలో టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ చేసింది శూన్యమని చంద్రబాబు అన్నారు. అంచెలంచెలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఇప్పడు జగన్ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. పరిపాలన అంతా అవినీతిమయమైందని, ఏపీలో సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదన్నారు.

ఎక్కువ ధరకు విద్యుత్ కొని, ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. నాశిరకం మద్యం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయకుంటే వాలంటీర్లు బెదరిస్తున్నారని, అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు

Tags

Read MoreRead Less
Next Story