Chandrababu: ముగిసిన టీడీఎల్పీ సమావేశం.. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు..

Chandrababu (tv5news.in)

Chandrababu (tv5news.in)

Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన ఆన్‌లైన్‌లో టీడీఎల్పీ సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు.

Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన ఆన్‌లైన్‌లో టీడీఎల్పీ సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనే సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఒకరోజు అసెంబ్లీ సెషన్‌ను తప్పుపట్టిన టీడీఎల్పీ.. కనీసం 15రోజులైనా నిర్వహించాలని డిమాండ్ చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. చట్ట సభలను వైసీపీ సర్కార్ అభాసుపాలుచేస్తోందని టీడీపీ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. 151 మంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్షాన్ని చూసి భయపడుతోందన్నారు ఎమ్మెల్యేలు.

మరోవైపు అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు టీడీపీఎల్పీ సంఘీభావం తెలిపింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతాంగానికి.. జగన్ సర్కార్ తీరని అన్యాయం చేస్తోందని ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

అటు కేంద్ర సర్కార్‌ డీజీల్, పెట్రోల్ ధరలు తగ్గించినా.. జగన్ సర్కార్‌ ఏం పట్టనట్లు వ్యవహరిస్తోందని టీడీఎల్పీ విమర్శించింది. ఇక సీపీఎస్ రద్దు చేస్తామని వైసీపీ ఇచ్చిన హామీ రెండున్నర ఏళ్లు గడుస్తున్నా అతిగతిలేదన్నారు.

ఉద్యోగస్తులు తన నిరసన గళం విన్పించగానే..అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదుల కోసం ప్రజలను ఉసిగొల్పుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడిపై మోయలేని భారం వేయటాన్ని టీడీఎల్పీ ఖండించింది.

Tags

Read MoreRead Less
Next Story