Chandrababu Meeting : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలి : చంద్రబాబు

Chandrababu (tv5news.in)

Chandrababu (tv5news.in)

Chandrababu Meeting : స్థానిక సంస్థల్లో జగన్ సర్కారును చిత్తుగా ఓడించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీసీఎం చంద్రబాబు.

Chandra Babu Meeting : స్థానిక సంస్థల్లో జగన్ సర్కారును చిత్తుగా ఓడించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీసీఎం చంద్రబాబు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలపై పార్టీ సీనియర్ నేతలతో అమరావతిలో సమావేశం నిర్వహించారు బాబు. వైసీపీని ఓడిస్తేనే ప్రజలకు రక్షణ ఉంటుందన్నారు. ఓటర్లంతా ఏకమై జగన్ సర్కారుకు గుణపాఠం చెప్పాలన్నారు. అమరావతి రైతులు చేస్తున్న న్యాయస్థానం నుంచి దేవస్థానం యాత్రకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. రెండున్నరేళ్ల పాలనలో ప్రజల్ని, రైతుల్ని జగన్ సంక్షోభంలోకి నెట్టారన్నారు. రాజధాని కూడా ఏదో చెప్పుకోలేని దుస్తితిలో ప్రజలున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.

డ్రగ్స్, గంజాయి విషయంలోనూ ప్రభుత్వ డొల్లతనం బట్టబయలైందన్నారు చంద్రబాబు. గంజాయిపై ప్రశ్నించిన వారిని కొట్టి, కేసులు పెట్టారన్నారు. 3 లక్షల కేజీల గంజాయి పట్టుబడిందని పోలీసులే చెబుతున్నా.... ప్రభుత్వం బుకాయిస్తోందని మండిపడ్డారు. 25వేల ఎకరాల్లో 8వేల కోట్ల గంజాయి సాగవుతోందన్న BBC కథనాన్ని గుర్తు చేశారు బాబు. మద్యనిషేధం ముసుగులో సొంత, నకిలీ మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్దారని మండిపడ్డారు. మహిళల పుస్తెలు కాపాడుతానని చెప్పి.. నేడు తాకట్టు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశే లక్ష్యంగా టీడీపీ పోరాటం చేస్తుందన్నారు చంద్రబాబు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలోనూ వైసీపీ సర్కారు ద్వంద్వ వైఖరి అవలభిస్తోందన్నారు చంద్రబాబు. జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు బాబు. చమురు, గ్యాస్, నిత్యావసర ధరలపైనా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ధరలు తగ్గించకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story