Chandrababu Naidu : 32 నెలల పాలనలో అంతా విధ్వంసమే : చంద్రబాబు

Chandrababu (tv5news.in)

Chandrababu (tv5news.in)

Chandrababu Naidu : జగన్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు.. 32 నెలల పాలనలో అంతా విధ్వంసమేనంటూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.

Chandrababu Naidu : జగన్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు.. 32 నెలల పాలనలో అంతా విధ్వంసమేనంటూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.. జగన్‌ పాలనలో ఇప్పటి వరకు ఏ విధంగా నష్టపోయాం, భవిష్యత్తులో ఎలా నష్టపోతామనేది ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.. ప్రజా వేదిక నుంచి నిన్న పల్నాడులో ఎన్టీఆర్‌ విగ్రహంపై దాడి ఘటన వరకు అన్ని అంశాలను ప్రస్తావించారు చంద్రబాబు.. అధికారంలోకి రావడంతోనే ప్రజా వేదికను కూల్చిన జగన్‌.. ఇప్పటి వరకు ఆ శిథిలాలు కూడా తొలగించలేదన్నారు.

అమరావతిపై మాట తప్పి.. రెండు లక్షల కోట్ల సంపదను నాశనం చేశారంటూ జగన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు చంద్రబాబు.. అమరావతిలో కట్టిన భవనాలు పాడుబడుతున్నాయన్నారు.. అమరావతి రైతులు ఇప్పటికీ అనుమానాలు భరిస్తున్నారన్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారని చంద్రబాబు నిలదీశారు..ఇప్పటికీ ఈ ప్రభుత్వం పోలవరాన్ని పూర్తిచేయలేకపోయిందని ఫైరయ్యారు చంద్రబాబు.. రివర్స్‌ టెండర్‌ ద్వారా ఏం సాధించారని ప్రభుత్వాన్ని నిలదీశారు.. అసలు పోలవరం పూర్తవుతుందా... పూర్తిచేసే దమ్ము జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఒక్క తట్ట మట్టి కూడా వేయలేకపోయారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌ చేశారంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు.. పరిశ్రమలు ఏపీ అంటేనే బాబోయ్‌ అనే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. కియా లాంటి ప్రాజెక్టులు తీసుకురావడం విధ్వంసం చేసినంత సులభం కాదన్నారు.. జగన్‌ నిర్వాకాన్ని యువత ఆలోచించాలన్నారు చంద్రబాబు.. అవినీతిని కేంద్రీకృతం చేసి అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తున్నారని ఫైరయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రజాసమస్యలపై ఎవరు పోరాడినా దాడులకు దిగే పరిస్థితి నెలకొందన్నారు.. ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారంటూ నిప్పులు చెరిగారు.. జ్ఞానాన్ని సైతం బలిపశువుని చేసి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని.. టీచర్లు కావాలని పిల్లలు ఆందోళన చేసే పరిస్థితులు కల్పించారంటూ ఫైరయ్యారు.

రాష్ట్రంలో జరుగుతున్న దాడులపైనా చంద్రబాబు ఘాటుగా స్పందించారు.. వంగవీటి రాధాపై రెక్కీ చేస్తే ఆధారాల్లేవని పోలీసులే చెప్పడం సిగ్గుచేటన్నారు.. పార్టీ కార్యాలయంపై దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇస్తే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు సన్మానం చేయాలంటూ సెటైర్లు వేశారు. జీవోలను రహస్యంగా పెట్టాల్సిన అవసరం ఏంటంటూ జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు చంద్రబాబు.. పారదర్శక పాలనంటూ గొప్పలు చెప్పిన జగన్‌.. ఇప్పుడు చేస్తోంది ఏంటని నిలదీశారు.. తప్పు చేస్తున్నారు కాబట్టే జీవోలను జగన్‌ దాచిపెడుతున్నారని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story