జగన్ రెడ్డి పాలనలో వ్యవసాయం సంక్షోభంలో పడింది: చంద్రబాబు

జగన్ రెడ్డి పాలనలో వ్యవసాయం సంక్షోభంలో పడింది: చంద్రబాబు

Nara chandrababu Naidu (File Photo)

విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటరీ రైతు సంఘాల నాయకులతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు.

విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటరీ రైతు సంఘాల నాయకులతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రైతులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించారు.. జగన్‌ రెడ్డి పాలనలో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు చంద్రబాబు. ప్రభుత్వం నుంచి సహకారం అందక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. విత్తనాలు, ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా 12,500 ఇస్తానని 7500 మాత్రమే ఇఛ్చి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. జగన్ రెడ్డి నరేగా బిల్లులు చెల్లించకుండా పనులు చేసిన వారిని ఇబ్బందులకు గురిచేశారని.. కోర్టు చివాట్లు పెట్టడంతో ఇప్పుడు బిల్లులు చెల్లిస్తున్నారని అన్నారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కెళ్లిందన్నారు చంద్రబాబు.. రాష్ర్టంలో అభివృది లేదు, ఉపాది, పెట్టుబడులు లేవని.. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి భావితరాల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ర్టంలో జోరుగా డ్రగ్స్ అక్రమ రవాణ జరుగుతోందన్నారు. అఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్ దిగుమతి జరుగుతోందన్నారు... ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో కంపెనీ పేరుతో 21 వేల కోట్ల ‍హెరాయిన్ పట్టుబడిన ఘటనను సమావేశంలో ప్రస్తావించారు. డగ్స్ వ్యాపారంతో టెర్రరిస్టుల్ని, ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. నాసిరకం మద్యంతో సొంత బ్రాండ్లు తెచ్చి మందుబాబులను ఆరోగ్యపరంగా, ఆర్దికంగా పీల్చి పిప్పి చేస్తున్నారని.. కరెంట్ చార్జీలు, నిత్యవసర ధరలు, పెట్రోల్, డీజిల్ ఇలా అన్ని రేట్లు పెంచి సామాన్యుడు రాష్ర్టంలో జీవించలేని పరిస్థితి తెచ్చారని ఫైరయ్యారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం వైసీపీయే అన్నారు చంద్రబాబు.

టీడీపీ హయాంలో వ్యవసాయాన్ని, రైతుల్ని అన్ని విధాల ప్రోత్సహించిన విషయాన్ని చంద్రబాబు సమావేశంలో ప్రస్తావించారు. ఐదేళ్లలో సాగునీటి రంగంపైనే 64 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. పట్టిసీమ ద్వారా నధుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి రాయలసీమకు నీరందించామని.. దేశంలో ఏ రాష్ర్టంలో లేని విధంగా వ్యవసాయ రంగంలో రెండంకెల వృద్ది సాధించామని గుర్తుచేశారు. రైతులకు మద్దరు ధరతోపాటు.. వరదలు, తుపాన్లు, ప్రకృతి విపత్తుల ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకున్నామన్నారు. అమరావతి, పోలవరం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని.. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 జూన్ నాటికి పోలవరం పూర్తయ్యుండేదని చెప్పారు. జగన్ వచ్చి అమరావతిని, పోలవరాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. రాష్ర్టం బాగుపడాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని.. అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story