Chandrababu : అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు చంద్రబాబు.. 40 శాతం ఫార్ములా సీక్రెట్ ఇదే!

Chandrababu : అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు చంద్రబాబు.. 40 శాతం ఫార్ములా సీక్రెట్ ఇదే!
Chandrababu : తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40వ‌సంతాలు పూర్తి చేసుకుంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన ప్రసంగం రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనూ....యువ‌తలోను పెద్దచర్చే జ‌రుగుతుంది.

Chandrababu : తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40వ‌సంతాలు పూర్తి చేసుకుంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన ప్రసంగం రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనూ....యువ‌తలోను పెద్దచర్చే జ‌రుగుతుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపిలో యువ‌త‌కు 40శాతం ప‌క్కా టికెట్లు ఇస్తాన‌ని చంద్రబాబు ప్రక‌టించారు.దీని ప్రకారం ప్రస్తుతం 175 సీట్లలో 40శాతం అంటే సుమారు 70సీట్లు యువ‌త‌కే ఇవ్వాల్సి ఉంటుంది.

ఇప్పటికే టీడీపీలో యువ‌నేత‌లు ఎప్పుడు రంగంలోకి దిగుదామా? ...ఎప్పుడు టికెట్ వ‌స్తుందా? అన్నట్లు ఎదురుచూస్తున్నారు. తాజాగా చంద్రబాబు ప్రక‌ట‌న‌తో ఎగిరి గంతేస్తున్నారు.ఇప్పటికే యువ‌త‌ను పార్టీకి ఓన్ చేసుకునే ప‌నిలో నారా లోకేష్ ఉన్నారు. పార్టీ వైపు యువ‌త‌ను ఆకర్షించే విధంగా నారా లోకేష్ కార్యక్రమ‌ాలు కూడా ఉంటున్నాయి. పార్టీ ప్రక‌టించిన అన్ని క‌మిటిల్లోనూ యువ‌త‌కు అధిక ప్రాధాన్యాత ఇచ్చారు. ఇప్పుడు తాజాగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ‌త‌కే అధిక ప్రాధాన్యత అంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్తో యువ‌తే కీ రోల్ కాబోతుంది.

యువ‌త‌కు ప్రాధాన్యత ఇచ్చే అంశంపై గ‌త కొద్ది రోజులుగా సీరియ‌స్ డిస్కష‌న్ జ‌రుగుతుంది. సీనియ‌ర్లు అయ్యన్నపాత్రుడు,గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి,య‌న‌మ‌ల.... అంతర్గత సమావేశాల్లో చంద్ర‌బాబు వ‌ద్ద యువ‌త అంశాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చారు. పార్టీ ఆవిర్బావం నుండి ఉన్న సీన‌య‌ర్ నేత‌లు అంతా వ‌య‌సు పైబ‌డటంతో యువ‌త‌కు ప్రాధాన్యత ఇస్తే పార్టీకి మ‌రో 40 ఏళ్ళు ఇబ్బంది ఉండ‌ద‌ని చెబుతూ వస్తున్నారు.

అలాగ‌ని సీనియ‌ర్ నేత‌ల‌ను పూర్తిగా ప‌క్కన పెట్టకుండా వారికి ప్రాధాన్యత ఇస్తూనే యువ‌త‌ను అధిక ప్రాధాన్యత ఇస్తే మ‌రింత మైరుగైన ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చనేది సీనియర్ల వాదన. దీంతో అన్ని ఆలోచించి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక‌ల్లో 40శాతం యువతకు టికెట్లు ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో సీనియ‌ర్ల పేరుతో కొంద‌రు నేత‌లు పెత్తనం చెలాయిస్తున్నారు. వారంద‌రికి ఈ ప్రక‌ట‌నతో ఓ హెచ్చరిక చేశారు చంద్రబాబు. ఈ 40శాతం ప్రక‌ట‌న‌తో ఇలాంటివారంతా తెర‌మ‌రుగు కావ‌డం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి చంద్రబాబు ప్రక‌ట‌న‌తో యువ‌తలో జోష్ పెరిగింది. అదే స‌మ‌యంలో సీనియ‌ర్ నేత‌ల‌తో భ‌యం ప‌ట్టుకుంది. 40శాతం యువ‌త‌కు టికెట్లు పేరుతో ఎవ‌రికి ఎర్త్ ప‌డుతుందో అనే ఆందోళ‌న సీనియ‌ర్లలో వ్యక్తమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story