Chandrababu: చంద్రబాబు తన భార్య గురించి ఏం చెప్పారంటే..

Chandrababu (tv5news.in)

Chandrababu (tv5news.in)

Chandrababu: ప్రెస్ మీట్‌లో చంద్రబాబు కామెంట్స్.. నా భార్యకు రాజకీయాలపై ఆసక్తి లేదు.

Chandrababu: ప్రెస్ మీట్‌లో చంద్రబాబు కామెంట్స్..

  • నా భార్యకు రాజకీయాలపై ఆసక్తి లేదు.
  • తండ్రి సీఎంగా చేసినా.. నేను సుదీర్ఘ కాలం సీఎంగా ఉన్నా.. ఎన్నడూ తెర మీదకు వచ్చే వ్యక్తే కాదు.
  • పార్టీ నేతల్లో చాలా మందికి కూడా ఆమె పరిచయమే లేదు.
  • రాజకీయాలకు దూరంగా ఉండే వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు.
  • రెండున్నరేళ్ల కాలంలో నన్ను బండ బూతులు తిట్టారు.
  • ఇది కౌరవ సభ.. గౌరవం లేని సభ.
  • వైఎస్ నా తల్లిని దూషించారు.. గట్టిగా నిలదీస్తే క్షమాపణలు చెప్పారు.
  • నాకు అన్యాయం జరిగింది.. నా భార్య విషయంలో అసభ్యంగా మాట్లాడుతున్నారు.. నా నిర్ణయం చెప్పాలని మైక్ అడిగితే స్పీకర్ ఇవ్వలేదు.
  • నా అవమానాన్ని నివారించే ప్రయత్నం కూడా చేయకుండా కనీసం మైక్ కూడా ఇవ్వలేదు.
  • సవాస దోషంతో స్పీకర్ వంటి వ్యక్తుల వైఖరిలో మార్పులు వస్తున్నాయి.
  • ప్రజలకు కష్టమొస్తే వెళ్లమని నా భార్యే ప్రొత్సహించేది.
  • తమ్మినేని లాంటి వ్యక్తి ఆత్మ విమర్శ చేసుకోవాలి.
  • అంతా చూసి కూడా స్పీకర్ మైక్ ఇవ్వలేదంటే ఏమనాలి..?
  • వాళ్లు చేసే తప్పులను వేరే వాళ్ల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.
  • ప్రజల్లోనే మార్పులు రావాలి.
  • ప్రజాక్షేత్రంలోనే నేను పోరాడతా.
  • ధర్మాన్ని గెలిపించాలా..? అధర్మాన్ని గెలిపించాలా..? అనేది ప్రజలే తేల్చాలి.
  • నా పోరాటం అంతా ప్రజల కోసమే.
  • వాజే పేయి ప్రధానిగా ఉన్న రోజుల్లో ఏ రోజు వ్యక్తిగత, రాజకీయం కోసం ఏనాడూ పాకులాడ లేదు.
  • రాష్ట్రం కోసం.. ప్రజల కోసమే పాటు పడ్డాం.
  • నేనేప్పుడూ నా వ్యక్తిగత పనులను ఆశించనని నాటి ప్రధాని వాజ్ పేయికి చెప్పాను.
  • ప్రజలు ఓట్లేసి 151 సీట్లు వైసీపీకిచ్చి.. మాకు 23 స్థానాలు ఇచ్చినా నేను బాధపడలేదు.
  • కానీ ఈ ప్రభుత్వం ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారింది.
  • నాకింకేం రికార్డులు అక్కర్లేదు.. ప్రజల కోసమే పని చేస్తున్నా.
  • నా ధర్మ పోరాటానికి ప్రజలు సహకరించాలి.
  • ప్రజా సహకారంతోనే మళ్లీ అసెంబ్లీకి వెళ్తాను.

Tags

Read MoreRead Less
Next Story