Chiranjeevi: ఏపీ సీఎం జగన్‌ను కలవనున్న మెగాస్టార్.. ఎందుకీ భేటీ..?

Chiranjeevi: ఏపీ సీఎం జగన్‌ను కలవనున్న మెగాస్టార్.. ఎందుకీ భేటీ..?
Chiranjeevi: ఇవాళ మెగా భేటీ జరగబోతోంది.. ముఖ్యమంత్రి జగన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి కలవనున్నారు.

Chiranjeevi: ఇవాళ మెగా భేటీ జరగబోతోంది.. ముఖ్యమంత్రి జగన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి కలవనున్నారు.. ఉదయం 11.30కు క్యాంప్‌ ఆఫీస్‌లో ఈ భేటీ జరగబోతోంది.. అయితే, ఈ భేటీలో ఏయే అంశాలపై చర్చిస్తారనేది ఆసక్తిని రేపుతోంది.. ఇప్పటికే ఏపీలో సినిమా టికెట్ల వివాదం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతుండటంతో చర్చనీయాంశం అవుతోంది.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై పలువురు సినీ నిర్మాతలు, హీరోలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

అయితే, మంత్రులు మాత్రం తక్కువ ఖర్చులోనే పేదలకు వినోదం అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్తున్నారు.. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి, సీఎం జగన్‌ భేటీ అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.. వివాదం మరింత ముదురుతుండటంతో చివరకు చిరంజీవే రంగంలోకి దిగారనే ప్రచారం జరుగుతోంది.. ఈ భేటీలో సినిమా టికెట్ల అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. జగన్‌తో కలిసి ఆయన లంచ్‌ చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story