లేఖపై సీఎం క్షమాపణలు చెబితే బాగుంటుంది : ఎంపీ రఘురామకృష్ణరాజు

లేఖపై సీఎం క్షమాపణలు చెబితే బాగుంటుంది : ఎంపీ రఘురామకృష్ణరాజు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా క్షమాపణలు చెబితే బాగుంటుందన్నారు ఎంపి రఘురామ కృష్ణం రాజు..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా క్షమాపణలు చెబితే బాగుంటుందన్నారు ఎంపి రఘురామ కృష్ణం రాజు. గతంలో న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు చేసిన మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌కు జైలు శిక్షవిధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. న్యాయ వ్యవస్థలోని అంశాలను బహిర్గతం చేస్తూ చేసిన ఆరోపణలు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ అటార్నిజనరల్ కేకే వేణుగోపాల్ వ్యాఖ్యానించారని రఘు రామకృష్ణరాజు అన్నారు.

అనువంశిక చట్టాల ప్రకారం మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పదవి చేపట్టడానికి సంచైతకు అవకాశం లేదన్నారు. ఆమె 2015లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన తండ్రిపేరు రమేష్ శర్మఅని, 2020లో ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో ఆనందగజపతిరాజు అని ప్రస్తావించినట్లు ఆయన వెల్లడించారు. మాన్సాస్ ట్రస్టు నియామకాల ప్రకారం అశోక్ గజపతిరాజును చైర్మన్‌గా పదవినుంచి తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story