ఆ విషయంపై స్పష్టత ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం

ఆ విషయంపై స్పష్టత ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం

సీఆర్‌డీఏపై ఇవాళ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేయనున్నారు. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఇవాళ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రాజధాని భూకేటాయింపుల్లోనూ, ల్యాండ్ పూలింగ్ వ్యవహారాల్లోనూ పలు అక్రమాలు జరిగాయని మొదటి నుంచి ఆరోపిస్తున్న CM జగన్.. అన్నింటిపైనా పూర్తిస్థాయిలో సమీక్షించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబధించిన సమాచారాన్నంతా సీఆర్డీఏ అధికారులు సిద్ధం చేశారు. అటు, ఇవాళ ముఖ్యమంత్రి సమీక్షకు ముందు పురపాలక మంత్రి బొత్స అమరావతిలో పనుల పురోగతిపై

సీఆర్డీయే, ఏడీసీ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు నిన్న దాదాపు 3 గంటలపాటు ఈ భేటీ సాగింది.

ఏయే నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయనే దానిపై ఓ నోట్ కూడా సిద్ధం చేశారు. అలాగే.. అమరావతి కోసం తెచ్చిన అప్పులు, బాండ్ల రూపంలో సేకరించిన డబ్బులు గత ప్రభుత్వం ఎలా ఖర్చు చేసిందనే దానిపై బొత్స వివరాలు అడిగారు. ఈ వివరాలన్నీ ఇవాళ్టి ముఖ్యంమంత్రి సమీక్షలో చర్చకు రానున్నాయి. అలాగే.. రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి వస్తున్న నిధులపైనా అధికారులు ఇచ్చే నోట్‌ను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారు. రాజధానిని అమరావతి నుంచి మార్చేది లేదని ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story