కరోనా రెండోసారి విజృంభిస్తోంది : చంద్రబాబు ముందస్తు హెచ్చరిక

కరోనా రెండోసారి విజృంభిస్తోంది : చంద్రబాబు ముందస్తు హెచ్చరిక

కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తప్పుబట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. కరోనా గురించి సీఎం జగన్ చాలా చులకనగా మాట్లాడారన్నారు. కనీసం రివ్యూ మీటింగ్‌లు పెట్టలేదన్నారు. పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంటే ప్రభుత్వం మాత్రం తేలికగా తీసుకుందన్నారు. వైరస్ కట్టడిలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ప్రజలు ఇప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు..

కరోనాపై ప్రధాని మోదీ ఏడుసార్లు జాతినుద్దేశించి మాట్లాడారన్నారు చంద్రబాబు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ప్రభుత్వం అండగా ఉండాలని, వారిని గౌరవించాలన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సరైన రీతిలో స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభ సమయాన్ని అవకాశంగా మలుచుకోవాలన్నారు.

కరోనా వారియర్స్‌ చేసే సహాయం భవిష్యత్‌లో ఆదర్శంగా నిలుస్తుందన్నారు చంద్రబాబు. కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకువచ్చిన వారికి అభినందనలు తెలిపారు చంద్రబాబు.కరోనా రెండోసారి విజృంభిస్తోందన్నారు చంద్రబాబు. ప్రతి ఒక్కరూ మాస్క్ అనేది తప్పకుండా ధరించాలని సూచించారు. ఫిజికల్ డిస్టెన్స్ అనేది తప్పనిసరిగా పాటించాలన్నారు. తాను వ్యక్తుల కోసం ఫైట్ చేయడం లేదు..ప్రజల కోసం ఫైట్ చేస్తున్నట్లు తెలిపారు. పది మందిలో మనం ఆదర్శంగా నిలబడాలని కరోనా వారియర్స్‌కు సూచించారు.

కరోనా తొలిరోజుల్లో ఎలా వస్తుందో అర్థం కాలేదన్నారు. బయటి నుంచి ఎవరొచ్చినా క్వారంటైన్‌లో ఉంచితే చాలన్నారు. కానీ కోవిడ్ సెంటర్లను ప్రభుత్వం సరైన రీతిలో హ్యాండిల్ చేయలేకపోయింది. ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికి అర్ధం కావడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story