తెలుగు రాష్ట్రాల్లో కోరలు చాస్తోన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాల్లో కోరలు చాస్తోన్న కరోనా మహమ్మారి
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇటు ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. సెకండ్ వేవ్ ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 13 వందల 21 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... ఒక్క రోజులో కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 293 మంది కోలుకున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే కొత్తగా 320 మందికి క‌రోనా సోకింది. ఇక తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3 లక్షల 12 వేల 140కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3లక్షల 2 వేల 500 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 17 వందల 17గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 7 వేల 923 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 3 వేల 866 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.

ఇటు ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. గడచిన 24 గంటల్లో 31 వేల 72 కరోనా పరీక్షలు నిర్వహంచగా 17 వందల 30 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరో ఐదుగురు మృతి చెందిపనట్లు వైద్యాధికారులు హెల్త్‌ బులిటెన్‌లో తెలిపారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 378 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 338, విశాఖ జిల్లాలో 235, కృష్ణా జిల్లాలో 226, నెల్లూరు జిల్లాలో 164 కేసులు గుర్తించారు. అత్యల్పంగా పశ్చిమ గోదావరిలో 10 కేసులు నమోదయ్యాయి. ఇక 24 గంటల్లోనే 842 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 10 వేల 300 యాక్టివ్‌ కేసులున్నాయి.



Tags

Read MoreRead Less
Next Story