ఏపీలో తొలి విడతలో 3.70లక్షల మందికి టీకా

ఏపీలో తొలి విడతలో 3.70లక్షల మందికి టీకా
తొలి విడత డోసు వేసిన 28 రోజుల అనంతరం రెండో డోసు ఇవ్వనున్నారు.

ఏపీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా జరిగేలా అధికారులు సన్నద్ధమయ్యారు. తొలి విడతలో ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ కేర్ సిబ్బందితో పాటు ఐసీడీఎస్ వర్కర్లు కలిపి 3లక్షల 70వేల మంది హేల్త్‌కేర్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్ అందించనున్నారు. వీరితో పాటు ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన తొమ్మిది లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తారు. అలాగే 50 సంవత్సరాల వయస్సు నిండి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడే వారికి కూడా తొలి విడత ఇంజక్సన్లు వేయడంలో ప్రాధాన్యతను ఇవ్వనున్నారు.

రాష్ట్ర స్థాయిలో సీఎస్ అధ్యక్షతన వైద్య ఆరోగ్య, హోం శాఖల ముఖ్య కార్యదర్శులతో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ నెలకు ఒకసారి సమావేశమై కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను సమీక్షించనుంది. అలాగే జిల్లా స్థాయిలో కలక్టర్ అధ్యక్షతన జిల్లా ఎస్పీ వైద్య ఆరోగ్య తదితర శాఖలతోను, మండల స్థాయిలో తహసీల్దార్ అధ్యక్షతన, మున్సిపాలిటీ స్థాయిలో మున్సిపల్ కమీషనర్ అధ్యక్షతన సంబంధిత శాఖలతో ఏర్పాటుచేసిన టాస్కు ఫోర్సు కమిటీలు వారానికి ఒకసారి సమావేశమై సమీక్షించనున్నాయి. అంతేగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఫిర్యాదులు పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో 24గంటలూ పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని 30 కేంద్రాల్లో ఏర్పాట్లు జరగుతున్నాయి. మొత్తం 1667 కరోనా వ్యాక్సిన్ స్టోరేజీ సెంటర్ల ఏర్పాటు చేయనున్నారు. ఇక గన్నవరంలో రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్ స్టోరేజీ సెంటర్.. కర్నూలు, కడప, గుంటూరు, విశాఖపట్నంలో రీజనల్ వ్యాక్సిన్ స్టోరేజీ పాయింట్లను సిద్ధం కానున్నాయి. అలాగే 4065 కోల్డ్ చెయిన్ ఎక్విప్ మెంట్ అందుబాటులో ఉంచారు. ప్రతి నియోజకవర్గంలో ఓ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. టీకా వేయించుకునే వారికి 0.5 మిలీ లీటర్ల వంతున కరోనా టీకా ఇవ్వనున్నారు. తొలి విడత డోసు వేసిన 28 రోజుల అనంతరం రెండో డోసు ఇవ్వనున్నారు.


Tags

Read MoreRead Less
Next Story