రాజమహేంద్రవరం జైలుకు దేవినేని ఉమా..

రాజమహేంద్రవరం జైలుకు దేవినేని ఉమా..
Devineni Uma: మాజీ మంత్రి దేవివేని ఉమాను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు పోలీసులు.

Devineni Uma: మాజీ మంత్రి దేవివేని ఉమాను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు పోలీసులు. కృష్ణా జిల్లా నుంచి వచ్చిన కాన్వాయ్‌లో సెంట్రల్‌ జైలు మెయిన్‌ గేటు వద్ద దిగి... జైలులోకి వెళ్లారు దేవినేని ఉమా. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు..పోలీసుల వలయంలోకి వెళ్లింది. జైలు పరిసర ప్రాంతంలోకి.. ఇతరులను ఎవ్వరినీ అనుమతించడం లేదు.

మాజీ మంత్రి దేవినేని ఉమాను రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు. నందివాడ పోలీస్ స్టేషన్‌ నుంచి భారీ భద్రత మధ్య తరలించిన పోలీసులు. హనుమాన్ జంక్షన్‌ సీఐ ఆఫీసులో జూమ్ ద్వారా మేజిస్ట్రేటు ముందు హాజరుపర్చారు. ఉమాకు... 14 రోజుల రిమాండ్ విధించింది మైలవరం కోర్టు. దీంతో... ఆయన్ను.. రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. కృష్ణా జిల్లా నుంచి వచ్చిన కాన్వాయ్‌లో సెంట్రల్‌ జైలు మెయిన్‌ గేటు వద్ద దిగి... జైలులోకి వెళ్లారు దేవినేని ఉమా. జైలు పరిసర ప్రాంతంలోకి..ఇతరులను ఎవ్వరినీ అనుమతించడం లేదు.

మంగళవారం గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణలపై వాస్తవాలను తెలుసుకునేందుకు వెళ్లి టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాపై పోలీసులు కేసులు పెట్టారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌తో పాటు 307 కింద హత్యాయత్నం కేసులు పెట్టారు జి.కొండూరు పోలీసులు. వీటితో పాటు మరో పది సెక్షన్ల కిందకేసులు నమోదు చేశారు. అనంతరం... నందివాడ పోలీస్‌ స్టేషన్‌కు దేవినేని ఉమను తరలించిన నేపథ్యంలో.. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు నందివాడ గ్రామాన్ని నిర్భందంలోకి తీసుకున్నారు. సరిహద్దులను పూర్తగా మూసివేశారు. మీడియాతో సహా ఎవరినీ గ్రామంలోకి అనుమతించలేదు.

దేవినేని ఉమా అరెస్టుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ నాయకులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు.. దేవినేని ఉమాపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ వాళ్లను వదిలిపెట్టి.. టీడీపీ నేతలపైనే కేసులు పెట్టడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. దేవినేని ఉమా అరెస్ట్‌ను ఖండించారు టీడీపీ నేతలు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దేవినేని ఉమాను విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన టీడీపీ నేతలు.. నాన్‌బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయడమేంటని ప్రశ్నించారు.

అక్రమ మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన దేవినేని ఉమాపై దాడి.. పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్టు కనిపిస్తోందంటున్నారు టీడీపీ నాయకులు. అక్రమ మైనింగ్‌ను ఆపలేని పోలీసులు.. వాస్తవాలను తెలుసుకునేందుకు వెళ్లిన టీడీపీ నేతలపైనే తిరిగి కేసులు పెట్టడం దారుణమని ఆపార్టీ వర్గాలు అంటున్నాయి. సీఎం జగన్‌ చెప్పినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఓవైపు భారీగా అప్పులు చేస్తూ.. రాష్ట్రాన్ని దివాళవైపు నడిపిస్తోన్న జగన్‌ ప్రభుత్వం...ఇలా టీడీపీ నేతలే టార్గెట్‌గా అరెస్ట్‌లు చేయడమేంటని మండిపడుతున్నారు జనం.

Tags

Read MoreRead Less
Next Story