TDP: టీడీపీ కార్యాలయాలపై దాడి ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని మండిపడుతున్న నేతలు..

TDP leaders (tv5news.in)

TDP leaders (tv5news.in)

TDP: పార్టీ కార్యాలయంపై దాడి విషయమై19 వ తేదినే మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది టీడీపీ.

TDP: పార్టీ కార్యాలయంపై దాడి విషయమై19 వ తేదినే మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది టీడీపీ. కానీ ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకపోవడంతో మండిపడుతున్నారు టీడీపీ నేతలు. పార్టీ రిసెప్షన్‌ కమిటీ సభ్యుడు కుమారస్వామి పేరుతో టీడీపీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో సీఎం, సీఎంఓ అధికారులు, డీజీపీల పేర్లను ప్రస్తావిస్తుంచారు.

డీజీపీ, సీఎంవో అధికారులకు తెలిసే దాడి జరిగిందని దురుద్దేశ్యంతో ప్రణాళిక ప్రకారం సీఎం, డీజీపీలు దాడికి కుట్రపన్నారనే అనుమానాన్ని ఫిర్యాదులో వ్యక్తం చేశారు కుమారుస్వామి. ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ నేత దేవినేని అవినాష్‌ ప్రోద్బలంతో ఈ దాడి జరిగిందని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే.. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు.

ఫిర్యాదు చేసి 24 గంటలు పూర్తైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. సీఎం, సీఎంఓ, డీజీపీ పేర్లు ఉండబట్టే ఎఫ్‌ఐఆర్‌ నమోదులో జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎఫ్‌ఐఆరు నమోదు చేయకపోవడంతో దీనిపై కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు టీడీపీ నేతలు..

Tags

Read MoreRead Less
Next Story