సౌత్‌ ఇండియన్‌ సినీ కల్చరల్ అసోసియేషన్ పేరుతో ఘరానా మోసం

సౌత్‌ ఇండియన్‌ సినీ కల్చరల్ అసోసియేషన్ పేరుతో ఘరానా మోసం

నెల్లూరు పట్టణంలో సౌత్‌ ఇండియన్ సినీ కల్చరల్ అసోసియేషన్ పేరుతో దోపిడీ జరిగిన ఘటన వెలుగుచూసింది. తడలో క్లబ్ ఏర్పాటు చేసిన మారెళ్ల పెంచల్ సుబ్బారెడ్డి అనే వ్యక్తి మోసం చేశాడు. వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తానని పలువురి వద్ద 10 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. చివరికి ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. తాము మోసపోయినట్టు గుర్తించిన బాధితులు.. తడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే చెన్నై, బెంగుళూరు ప్రాంతాల్లో 7 సంస్థలు పెట్టి మోసం చేసినట్టు తేలింది. 10 కోట్ల రూపాయలు మోసం చేసిన సుబ్బారెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story