ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి మొదటి గేర్..

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి మొదటి గేర్..

‌ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలో తొలి అడుగు పడింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీ వేసింది ప్రభుత్వం. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి చైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో ఈ అధ్యయన కమిటీ ఏర్పాటయ్యింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో సభ్యులుగా ఆర్‌ అండ్‌ బి ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, ఆర్థిక కార్యదర్శి, ఆర్టీసీ ఈడీ, రిటైర్డ్‌ ఇంజినీర్‌ సుదర్శనం ఉన్నారు. ఆర్టీసీ విలీనానికి సంబందించి విధివిధానాల రూపకల్పన, సమస్యలు - వాటి పరిష్కారం, కార్మికుల ఆర్థిక పరమైన సమస్యలపై అధ్యయనం చేస్తుంది.

మరోవైపు... ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టడంపై నలుగురు సభ్యులతో కూడిన మరో కమిటిలో వేశారు. భారత పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ మాజీ ఎండీ భక్తవత్సలం ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ‌బస్సుల్ని ప్రవేశ పెట్ అంశాలపై సాధ్యాసాధ్యాలు, బ్యాంకులకు ఆర్టీసీ ఉన్న అప్పుల పరిష్కారంపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభమైనందుకు ఆనందం వ్యక్తం చేశారు జేఏసీ నేతలు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను స్వాగతిస్తున్నామన్నారు. ఈ రెండు కమిటీలు మూడు నెలల్లో రిపోర్ట్‌ ఇవ్వనున్నాయి. ఈ నివేదికల ఆధారంగా.. ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Tags

Read MoreRead Less
Next Story