Andhra News: పెళ్లి పీటల మీద కుప్పకూలిన వరుడు.. మరొకరితో వధువు మెడలో మూడుముళ్లు

Andhra News: పెళ్లి పీటల మీద కుప్పకూలిన వరుడు.. మరొకరితో వధువు మెడలో మూడుముళ్లు
Andhra News: ఏం జరుగుతోంది.. 60 ఏళ్ల వయసులో రావలసిన అనారోగ్య సమస్యలు 20 ఏళ్లకే వచ్చేస్తున్నాయి.. పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిచాలనుకున్న అతడి జీవితం అప్పుడే ముగిసిపోయింది.

Andhra News: కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు మండలం తుంబళం గ్రామానికి చెందిన అబ్దుల్ హమీద్ పదో తరగతి వరకు చదివి స్వగ్రామంలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. హొళగుంద మండలం గజ్జెహళ్లి గ్రామానికి చెందిన నూర్ ఎ చెస్ అనే యువతితో అబ్దుల్ హమీద్ వివాహం జరిపించడానికి పెద్దలు నిశ్చయించారు. మే 22న నిఖా జరగాల్సి ఉండగా.. వధువు గ్రామంలో పెళ్లి జరుగుతుండడంతో వరుడు, వారి బంధువులంతా నిన్న రాత్రి వధువు స్వగ్రామమైన గజ్జెహళ్లికి చేరుకున్నారు.

రాత్రి చిన్న ఫంక్షన్‌ కూడా రెడీ చేశారు. ఇంతలో వరుడు కడుపులో నొప్పిగా ఉందని చెప్పాడు. నొప్పి తీవ్రం కావడంతో బంధువులు సమీపంలోని సిరిగుప్ప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే అబ్దుల్ హమీద్ మృతి చెందాడు. సరిగ్గా పెళ్లికి గంట ముందు మరణించాడు. వధువు తల్లిదండ్రులు, బంధువులు పెళ్లి కొడుకు కోలుకోవాలని కోరుకున్నారు.

అతడి మరణం ఇరు వర్గాల బంధువులను కలచి వేసింది.. కానీ వధువు జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని బంధువులు మరో అబ్బాయితో మాట్లాడి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. వందవాగిలి గ్రామానికి చెందిన నబీ రసూల్‌తో నూర్ వివాహం జరిపించారు. రసూల్ వివాహానికి అంగీకరించడంతో విచారంలో ఉన్న వధువు కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మృతి చెందిన పెళ్లికొడుకు ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story