ఏపీలో మద్యంపై అసమగ్ర విదానాన్ని సరిచేసిన హైకోర్టు

ఏపీలో మద్యంపై అసమగ్ర విదానాన్ని సరిచేసిన హైకోర్టు
మద్యం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అసమగ్ర విదానాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం..

మద్యం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అసమగ్ర విదానాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం సరిచేసింది. వైసీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తరువాత నూతన మద్యం విదానాన్ని ప్రకటించింది. ఈ విధానంలో అప్పటివరకు ప్రైవేటు ఆధ్వర్యంలో నడుస్తున్న మధ్యం దుకాణాలను రద్దు చేశారు. ప్రైవేటు స్ధానంలో ప్రభుత్వ ఆద్వర్యంలోనే మధ్యం దుకాణాల నిర్వహాణకు శ్రీకారం చుట్టారు. అక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా.. అక్కడే అసలు సమస్య మొదలైంది. ఇంతకుముందు మందుబాబులకు ప్రియమైన మద్యం బ్రాండ్లు ఉండేవి.. నూతన పాలసీ ప్రవేశ పెట్టిన తరువాత వాటి స్ధానంలో కొత్త బ్రాండ్లు ప్రత్యక్షమయ్యాయి.

అసలు తామెప్పుడు.. వినని.. చూడని మద్యం బ్రాండ్లు ప్రభుత్వ దుకాణాల్లో ప్రత్యక్షమవడంతో లిక్కర్ లవర్స్‌ షాక్‌కు గురయ్యారు. వారి దృష్టి ఇతర రాష్ట్రాలపై పడింది. తమకు నచ్చిన బ్రాండ్లు దొరికే రాష్ట్రం నుంచి భారీగా తెప్పించుకోవడం మొదలైంది. అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక పోలీస్ బృందాల సహాయంతో, అక్రమ మధ్యం రవాణాను కట్టడిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక పోలీస్ బృందాల తనిఖీలు ముమ్మరమవడంతో ప్రతిరోజు వేలాది మధ్యం బాటిల్స్ స్వాదీనం చేసుకోవడమేనే ప్రక్రియ నిత్యకృత్యంగా మారింది. అక్రమ మద్యంపై కేసుల వరకు ఓకే అయినా.. పొరుగు రాష్ట్రం నుంచి క్వార్టర్ మద్యం తెచ్చుకున్నా కేసులు నమోదు చేస్తూ ప్రత్యేక పోలీస్ బృందాలు మందుబాబులను హాడలెత్తించాయి. దీంతో ప్రభుత్వ చర్యను సవాల్ చేస్తూ కొందరు న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. జీ.వో 411 ప్రకారం పొరుగు రాష్ట్రాలనుంచి ఎవరైనా 3 మధ్యం బాటిల్స్ ను తెచ్చుకోవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది.

అయితే నూతన మద్యం విధానం ద్వారా ఏపీ ప్రభుత్వం అనుసరించిన విధానం మాత్రం లోపభూయిష్టంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో పరిమితికి లోబడి కొనుగోలు చేసి మద్యాన్ని ఏ రాష్ట్రానికైనా తీసుకెళ్లే సౌలభ్యం దేశమంతా ఉంది. ఒక ఏపీలోని ప్రజలకు మాత్రం ఈ ఛాన్స్ లేదు. ఏపీలో కొనుగోలు చేసిన మద్యాన్ని తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు తీసుకువెళ్తుంటే లేని అభ్యంతరం.. పొరుగు రాష్ట్రాల్లో విక్రయించే మద్యాన్ని పరిమితికి లోబడి ఏపీకి తీసుకురాకూడదనే ఆంక్షలు ఏమిటని మందుబాబులు ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story