ప్రత్యేక హోదా ఇచ్చే వరకు అడుగుతూనే ఉంటాం- సీఎం జగన్‌

ప్రత్యేక హోదా ఇచ్చే వరకు అడుగుతూనే ఉంటాం-  సీఎం జగన్‌

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్మోహన్‌ రెడ్డి.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశం అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరాన్ని వివరించారు. అలాగే విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను అమిత్‌ షా దృష్టికి తీసుకు వెళ్లిన జగన్.. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు అడుగుతూనే ఉంటామని అన్నారు. మరోవైపు వైసీపీ ఎంపీలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో.. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.

ఇవాళ జరిగే నీతి ఆయోగ్‌ సమావేశం కోసం శుక్రవారం ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, విభజన చట్టంలోని అనేక అంశాలు అమలుపై అమిత్‌షాకు లేఖ ఇచ్చారు. రాష్ట్రానికి హోదా అవసరం ఎంతో ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రం అన్ని రకాలు ఇబ్బందులు ఎదుర్కొంటోందని.. ఈ పరిస్థితుల్లో కేంద్ర సాయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ అభివృద్ధికి సంబందించి ఇరువురు మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అనంతరం.. సీఎం జగన్‌ మాట్లాడారు. విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపై అమిత్‌షాతో చర్చించామన్నారు. హోదా అవసరాన్ని కూడా వివరించామన్నారు. ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తూనే ఉంటామని.. కేంద్రం ఇచ్చే వరకు అడుగుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇవాళ జరగబోయే నీతి ఆయోగ్‌ సమావేశంలోనూ ప్రత్యేక హోదా అడుగుతామన్నారు జగన్‌.

మరోవైపు.. లోక్‌ సభ డిప్యూటీ స్పీకర్‌ పదవి వైసీపీకి ఆఫర్‌ చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు ఏపీ సీఎం జగన్‌. తాము ఆ పదవి కావాలని కోరలేదని, వారు ఇస్తామని చెప్పేలేదన్నారు. దీనిపై ఎలాంటి చర్చ జరగలేదని క్లారీటీ ఇచ్చారు జగన్‌. మరోవైపు ఇవాళ వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో చర్చించనున్నారు సీఎం జగన్‌. ఏపీ సమస్యలపై ఎలా వ్యవహరించాలో వైసీపీ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story