ప్రజలు చనిపోతుంటే పరీక్షలు పెడతారా .. తీర్పువచ్చేవరకు దీక్ష కొనసాగిస్తా : కేఏ పాల్

ప్రజలు చనిపోతుంటే పరీక్షలు పెడతారా .. తీర్పువచ్చేవరకు దీక్ష కొనసాగిస్తా : కేఏ పాల్
ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి చలనం లేదా అని ప్రశ్నించారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. కోర్టు తీర్పు వచ్చేవరకు పరీక్షల రద్దుపై తాను దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి చలనం లేదా అని ప్రశ్నించారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. కోర్టు తీర్పు వచ్చేవరకు పరీక్షల రద్దుపై తాను దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. విద్యార్ధులకు పరీక్షలు పెట్టి.. ఆరోగ్యంగా ఉన్నవారిని చంపేద్దామనుకుంటున్నారా ప్రశ్నించారు. టెన్త్, ఇంటర్ పరీక్షలను జులైకి వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

అటు టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచని చెప్పింది. లక్షల మంది విద్యార్థుల జీవితాలకు ముడిపడిన విషయమన్న కోర్టు.. పక్క రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేస్తే మీరెలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

కోవిడ్‌ బాధిత విద్యార్థులకు విడిగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పగా... విద్యార్థుల మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీకెలా తెలుస్తుందని కోర్టు నిలదీసింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వచ్చే నెల 3 కి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story