ఓ వైపు పోలీస్ ఆంక్షలు..మరోవైపు పందెం కోళ్ల సవాళ్లు

ఓ వైపు పోలీస్ ఆంక్షలు..మరోవైపు పందెం కోళ్ల సవాళ్లు
పందాలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

ఓ వైపు పోలీస్ ఆంక్షలు..మరోవైపు పందెం కోళ్ల సవాళ్లతో ఉభయ గోదావరి జిల్లాలో పండుగ సందడి మొదలైంది. కోడి పందాలపై అంక్షలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నా.. పందెం రాయుళ్లు పట్టించుకోవటం లేదు. సంక్రాంతి సంబరం అంబరాన్నంటేలా కోళ్లను గూళ్లలోంచి బయటకు తీసి ఊళ్లు దాటిస్తున్నారు. కొబ్బరితోటల్లో మకాల వద్దా, మామిడితోపుల్లోనూ రొయ్యల చెరువు కట్టలపైనా ఇప్పుడు కోళ్లన్నీ బరుల్లో భారీ ఫైట్‌కు సిద్ధమవుతున్నాయి.

ఆంక్షల పేరుతో పోలీసులు బరులు గీసిన వారి భరతం పడుతున్నారు. కోడి పందాలు నిర్వహించాలనుకున్న పందెం రాయుళ్ల ఆశలపై కృష్ణా జిల్లా పోలీసులు నీళ్లు చల్లారు. పందెం రాయుళ్లకు చెక్ పెట్టారు. కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామ శివారులోని మామిడి తోటలో కోడి పందాల కోసం ఏర్పాటు చేసిన బరులను ట్రాక్టర్‌తో ధ్వంసం చేశారు . నందిగామ రూరల్‌ సర్కిల్ పరిధిలో ఇప్పటివరకు కోడిపందాలకు సంబంధించి 21 కేసుల్లో 42 మందిని బైండోవర్ చేసినట్లు పోలీసులు చెప్పారు. పందాలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.


Tags

Read MoreRead Less
Next Story