పౌల్ట్రీ పరిశ్రమలకు కోట్ల రూపాయల్లో నష్టం

పౌల్ట్రీ పరిశ్రమలకు కోట్ల రూపాయల్లో నష్టం
రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో కోళ్ల పరిశ్రమల ద్వారా... కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది. కానీ కరోనా వ్యాధి ఉధృతమవుతున్నసమయంలో చికెన్‌ తినడం..

రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో కోళ్ల పరిశ్రమల ద్వారా... కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది. కానీ కరోనా వ్యాధి ఉధృతమవుతున్నసమయంలో చికెన్‌ తినడం ప్రమాదం అంటూ దుష్ప్రచారం జరిగింది. ఫలితంగా విక్రయాలు భారీగా పడిపోయాయి. పౌల్ట్రీ పరిశ్రమకు కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లింది. అనంతరం... రోగనిరోధకశక్తిని పెంపొందించేందుకు కోడి గుడ్డు, చికెన్‌ ద్వారా సత్ఫలితాలు వస్తాయని ప్రభుత్వం, అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చికెన్‌ విక్రయాలు జోరందుకున్నాయి. కానీ ఉత్పత్తి మాత్రం పెరగలేదు. ప్రస్తుతం ఏపీలో కోళ్ల ఉత్పత్తి పూర్తి స్థాయిలో లేకపోవడంతో కర్నాటక, తమిళనాడు నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇతర రాష్ట్రాలకు సరఫరా ఎగుమతి చేసేవాళ్లు. కరోనా పరిస్థితుల్లో ఉత్పత్తి లేకపోవడం, కూలీల కొరతతో చికెన్‌ ధరలు పెరిగాయి. అధిక ధరలు వెచ్చించలేక కొనుగోళ్లు పడిపోతున్నాయి. పౌల్ట్రీ నిర్వహణ భారంగా మారి... నష్టాలపై ఆందోళన చెందుతున్నారు.

కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పౌల్ట్రీ పరిశ్రమల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కోడిగుడ్ల వినియోగం కూడా పెరగడంతో ధర రెండింతలైంది. ఇక చికెన్‌ ధర అయితే మూడు రెట్లు పెరిగింది. పెరిగిన ధరలతో వినియోగదారులు కొనుగోళ్లకు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమకు రాయితీల ద్వారా సాయం అందిస్తున్నాయి. అలాగే అంధ్రప్రదేశ్‌లోనూ ప్రభుత్వం పౌల్ట్రీ రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి... ఆదుకోవాలని పౌల్ట్రీ నిర్వాహకులు, వినియోగదారులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story