Kadapa : ఏపీ సీఎం సొంత జిల్లాలో భారీ భూ కుంభకోణం

YS Jagan (tv5news.in)

YS Jagan (tv5news.in)

Kadapa : ఏపీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో భారీ భూ కుంభకోణం బట్టబయలవుతోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో భూ దురాక్రమణ జరుగుతోంది.

Kadapa : ఏపీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో భారీ భూ కుంభకోణం బట్టబయలవుతోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో భూ దురాక్రమణ జరుగుతోంది. ఊరూరా వైసీపీ నాయకులు కరుడు గట్టిన కబ్జా కోరులౌతున్నారు. వేల ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా కబ్జా చేసి కోట్లు దండుకుంటున్నారు.

బద్వేలు నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అతిక్రమణ ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చలా మారుతోంది. అంతులేని భూ దాహంతో పేద దళితులపై అరాచక పర్వాన్ని కొనసాగిస్తున్నారు. కలసపాడు మండలం రెడ్డి పల్లె గ్రామ దళితులకు.. రామపురం రెవెన్యూ గ్రామం, సర్వే నెంబర్ 139/2, 140/2 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 18 ఎకరాల భూమిని అసైన్మెంట్ చట్టం ద్వారా వీరికి కేటాయించింది. అధికార పార్టీకి చెందిన కీలక నేత అనుచరుడు.. స్థానిక వైసీపీ మండల నేత, ప్రస్తుత సర్పంచ్ తమ భూములపై కన్నేశాడని దళితులు ఆరోపిస్తున్నారు. అంతే.. రాత్రికి రాత్రే సరిహద్దుల రాళ్లు మాయం చేసి ముళ్లకంచె బిగించాడని.. లబోదిబోమంటూ నెత్తి నోరు బాదుకుంటున్న బాధితులు టీవీ5ని ఆశ్రయించారు.

కడప జిల్లాలో నూతనంగా ఏర్పడిన బద్వేల్ రెవెన్యూ డివిజన్‌లో అధికార పార్టీ నేతల ఆగడాలు చెప్పనలవి కావడం లేదు. తమకున్న పవర్, పలుకుబడులతో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమంగా ఆన్‌లైన్‌ చేయించుకుంటూ కబ్జా పర్వాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. ఒక్క బద్వేల్ నియోజకవర్గంలోనే అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమి అక్షరాల 8.6 వేల ఎకరాలు అంటే నమ్మగలరా..? కానీ ఇది పచ్చి నిజం.

ప్రభుత్వ భూముల కబ్జా పర్వంలో రెవెన్యూ అధికారులే ఇప్పుడు కీలకమౌతున్నారు. అధికార పార్టీ నేతలు ఇచ్చే పచ్చనోట్లకు బానిసలైన రెవెన్యూ యంత్రాంగం ఉద్యోగాన్ని మరచి రాజకీయం చేస్తున్నారు. కలసపాడు, కాశినాయన, పోరుమామిళ్ల, బి.కోడూరు మండలాల్లో స్థానిక నాయకులతో జతకట్టి విలువైన ప్రభుత్వ భూములను అప్పనంగా అధికార పార్టీ నాయకులకు కట్టబెట్టేస్తున్నారు.

ఈ మండలాల్లో వైసీపీ నాయకులు అభినవ జమీందారులౌతున్నారు. ఒక్కో నాయకునికి, అతని కుటుంబ సభ్యులకు, బినామీల పేరిట వేల ఎకరాల ప్రభుత్వ భూములు వీరికబంధ హస్తాల్లో నలిగిపోతున్నాయి. ఒక్కో నాయకునికి తక్కువ అంటే 50 నుండి 100 ఎకరాల పైబడి ప్రభుత్వ భూములు వీరి చెరలో చిక్కి ఉన్నాయి. బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ కీలక నేత బంధువులు, అనుచరులు ‌ రాజ్యాంగేతర శక్తులుగా మారుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. అక్కడ వైసీపీ నేతల భూ దాహం ఇప్పట్లో తీరేలా కనబడట్లేదు. ఇలా.. ఒక్కో నేత కబ్జా వ్యవహారాలపై టీవీ5 పక్కా ఆధారాలు సేకరించింది.

Tags

Read MoreRead Less
Next Story