Perni Nani Counter : వర్మ ట్వీట్లకు మంత్రి పేర్ని నాని కౌంటర్లు

Perni Nani Counter : వర్మ ట్వీట్లకు మంత్రి పేర్ని నాని కౌంటర్లు
Perni Nani Counter : సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు బలాన్ని ఇచ్చినట్టు, సామాన్యున్ని దోచుకోకుండా ఆపితే నెత్తిన ఎక్కినట్టా అంటూ ప్రశ్నించారు.

Perni Nani Counter : వర్మ ట్వీట్లకు మంత్రి పేర్ని నాని కౌంటర్లు ఇచ్చారు. సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు బలాన్ని ఇచ్చినట్టు, సామాన్యున్ని దోచుకోకుండా ఆపితే నెత్తిన ఎక్కినట్టా అంటూ ప్రశ్నించారు. వంద రూపాయల టికెట్‌ను వేయి, 2వేలకు అమ్ముకోవచ్చని ఏ ఎకనమిక్స్‌ చెబుతోందంటూ వర్మను క్వశ్చన్ చేశారు. అయితే, మంత్రి చేసిన ట్వీట్లకు ఒక లాజిక్‌ గాని, కౌంటర్‌ ఇస్తున్నట్లుగాని లేనే లేవంటూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. కేవలం ట్వీట్‌కి రిప్లైతో సరిపెట్టారంటూ మంత్రి పేర్ని నాని ట్విట్లకు నెజిటన్స్ కౌంటర్స్‌ ఇస్తున్నారు. వర్మ అడిగిన ప్రశ్నలకు సూటిగా, సుత్తి లేకుండా సమాధానాలు చెప్పకుండా.. మరేదో విషయాలు చెబుతున్నారేంటి అని వరుస ట్వీట్లు చేస్తున్నారు.

థియేటర్లు అనేవి ప్రజాకోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు కాబట్టే.. వాటిని నియంత్రిస్తున్నాం అంటూ కొత్త భాష్యం చెప్పారు మంత్రి పేర్ని నాని. సినిమాను నిత్యావసరంగానో, అత్యవసర సర్వీసుగానో జగన్ ప్రభుత్వం చూడడం లేదని మంత్రి పేర్ని నాని రిప్లై ఇచ్చారు. దీనిపై నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. పెట్రోల్, పప్పు, చింతపండు నిత్యావసరాలే కదా.. వాటి ధరలు తగ్గించండని అడుగుతున్నారు. అసలు నిత్యావసరం కాని దాని గురించి ఇంత గలాటా ఎందుకని నిలదీస్తున్నారు. సినిమా చూడండని నిర్మాతలు గాని, హీరోలు గాని ఎవరినీ బలవంత పెట్టడం లేదని, అసలు దాని గురించి ఎవరూ అడగడం లేదని.. కాని, ధరలు తగ్గించండని మొత్తుకుంటుంటే మాత్రం ఈ ప్రభుత్వానికి చెవికెక్కడం లేదని ట్వీట్స్‌ చేస్తున్నారు.

సామాన్యుడి మోజుని, అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పేర్ని నాని వర్మకు రిప్లై ఇచ్చారు. దీనిపై పేర్ని నానికి మామూలు కౌంటర్లు పడడం లేదు. తెలంగాణ ఆర్టీసీలో విశాఖ నుంచి హైదరాబాద్‌కు వేయి రూపాయల ఛార్జి ఉంటే.. అదే ఏపీఎస్‌ఆర్టీసీలో విశాఖ నుంచి హైదరాబాద్‌ రావడానికి 1500 రూపాయల ఛార్జీ ఉందని.. దీన్ని లూటీ చేయడం అనరా అంటూ కౌంటర్స్‌ వేస్తున్నారు. తెలంగాణ, కర్నాటకలో ఉప్పూ, పప్పు ధరలను ఏపీలో ధరలతో పోలుస్తూ ఏకంగా ధరల పట్టికనే పోస్ట్‌ చేశారు.

మొత్తానికి వర్మకు రిప్లై ఇవ్వడం ఏమో గాని.. నెటిజన్లు మాత్రం దిమ్మతిరిగే రీతిలో కౌంటర్స్ విసురుతున్నారు. మరి వీటికి కూడా మంత్రి పేర్ని నాని రిప్లై ఇస్తారా, సామాన్యులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇస్తారా అనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story