RGV, Perni Nani: మంత్రి పేర్ని నానితో డైరెక్టర్ RGV భేటీ

RGV, Perni Nani: మంత్రి పేర్ని నానితో డైరెక్టర్ RGV భేటీ
RGV, Perni Nani: ఇదే విషయంలో మంత్రి పేర్ని నాని నుంచి కౌంటర్ రావడంతో ఇద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా...వాదన జరిగింది.

RGV, Perni Nani: మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. సమావేశంలో సినిమా టికెట్ ధరలపై మంత్రితో చర్చించనున్నారు. ఆర్జీవీ, మంత్రి పేర్ని నానిల మధ్య సినిమా టికెట్ల అంశంపై ట్విట్టర్ వార్ నడిచింది. ఏపీ సర్కార్‌ నిర్ణయించిన టికెట్ రేట్లను తీవ్రంగా వ్యతిరేకించారు రామ్‌గోపాల్ వర్మ. టికెట్ ధరను నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. పది ప్రశ్నలతో ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇదే విషయంలో మంత్రి పేర్ని నాని నుంచి కౌంటర్ రావడంతో ఇద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా...వాదన జరిగింది.

భేటీకి ముందు మీడియాతో మాట్లాడారు వర్మ. సినిమా ఇండస్ట్రీ తరపున కాకుండా తన సొంత అభిప్రాయం చెప్పడానికి వచ్చానన్నారు. అంతిమంగా ప్రభుత్వానిదే తుది నిర్ణయమని చెప్పారు. ఏపీ సర్కార్ జీవో నెంబర్ 35 ప్రవేశపెట్టి సినిమా టికెట్ల ధరలకు నిర్ణయించింది. అంతకంటే ఎక్కువ ధరలకు టికెట్లు అమ్మకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఐతే దీనిపై పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించారు.

విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసింది. ఐతే తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్ చేయడంతో మరోసారి ఏపీ హైకోర్టు టికెట్ల వివాదంపై విచారణ చేపట్టింది.

ఇక, టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వంతో చర్చించేందుకు ఇండస్ట్రీ పెద్దలెవరూ ముందుకు రాలేదు. ఐతే ఇప్పుడు ఆ బాధ్యతను ఆర్జీవీ తీసుకున్నారు. ఆర్జీవీ-మంత్రి పేర్ని నానిల మధ్య జరిగే సమావేశంతో ఎలాంటి రిజల్ట్‌ వస్తుందనేది ఆసక్తిగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story